మరణం తర్వాత? ఏం జరుగుతుంది?
ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే ....దీనికి సమాదానంగా.... ఒక పండితుడు పురాణాల ననుసరించి చర్చించిన ఒక Post పంపినారు ఇది చదివి .... మన మిత్రులకు కూడా తెలుపుదాం *భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది* భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. సూక్ష వెండి తీగ ***** అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జ...