వేదమంత్రాలన్నింటికీ తల్లి.. గాయత్రి
వేదమంత్రాలన్నింటికీ తల్లి.. గాయత్రి. ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు చొప్పున మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలు ఉండే మంత్రం ఇది. అందుకే దీనిని ‘త్రిపదగాయత్రి’ అంటారు. ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం తాలూకూ సారం. అధర్వణ వేదానికి వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా ఉపనయనము చేసుకోవలసి ఉంటుంది. త్రిపద గాయత్రి ఋగ్యజస్సామ వేదాల సారం. ఎంతటి కష్టకాలంలోనైనా సరే గాయత్రీ మంత్రాన్ని కనీసం పదిసార్లయినా జపించాలి. నిత్యం ముమ్మారు సంధ్యావందనం చేయాలి. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేచి మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. పగలంతా శ్రమ పడిన జీవులు సాయంకాలం ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవతలను ధ్యానించాలి. ఉదయం విష్ణుప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగానూ, సాయంత్రం శివస్వరూపిణిగానూ గాయత్రిని ధ్యానించాలి. ఈ మూడు కలిసి సమిష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రాల శక్తులనూ కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రాన్ని జపిం...