Posts

Showing posts with the label ఏం వదిలేయాలి?

ఏం వదిలేయాలి?

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి. దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం. పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాపపంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే! నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప. వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది. పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు...