పంచభూత లింగములు
భారతదేశ ప్రసిద్ద ఆలయాలు - పంచభూత లింగములు పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము ,ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభుత లింగములు అంటారు . 1. పృధ్వీ లింగము : ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) - అరుల్మిగు కంచి ఏకాంబరనాథర్ తిరుకొయిల్ తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు . ఏకాంబరేశ్వర దేవాలయం (తమిళం: ஏகாம்பரநாதர் கோயில்) లేదా ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి [1]. ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి [2] కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిల...