(Telugu) శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి
[:te]అధునాతన సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి, హేతువాదిగా ఉన్న నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా అందించిన మహాప్రవక్త, పరమరుషి రామకృష్ణపరమహంస. ఆధ్యాత్మ చింతనకే జీవితాన్ని అంకితం చేసిన వాడు, కాళిమాత చరణారవింద సంసే వనా భాగ్యోపేతుడు రామకృష్ణ. ఆలిలోనూ అమ్మను చూడగలిగిన పరమభక్తి పరిపూర్ణుడు రామకృష్ణ. 1836 ఫిబ్రవరి18న పశ్చిమబెంగాల్లోని హుగ్లీజిల్లా కామార్పుకూర్లో జన్మించాడని, కొస్సీపూర్ వనాంతర గృహంలో 1886 ఆగస్టు16న 50వ యేట శరీరత్యాగం చేశాడని అనుకోవడమే తప్ప అంతటి మహనీయుడికి జననమరణాలుంటాయా? జనన మరణాలు, ప్రపంచయాత్రలు పాంచభౌతిక శరీరానికే తప్ప అటువంటి దివ్యాత్మకుల కుంటాయా? 19వ శతాబ్దంలో పశ్చిమబెంగాల్లో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం పైనే కాదు యావత్ ప్రపంచం పైనా తన ప్రభావాన్ని బలంగా వేసిన రామకృష్ణ పరమహంస కన్నా గొప్ప సర్వమత సమతా వాది మరొకడు కానరాడు. పార లౌకికచింతనలో నిత్యం తన్మయమై ఉన్నా ఆయన బోధనలలో లౌకికవాద సారం తొణికిసలాడుతుంటుంది. ఆయన భావనలు నిత్యాలు-వాక్కులు సార్వకాలిక సత్యాలు. తండ్రి క్షుదీరామ్, తల్లి చంద్రమణి అని చెప్పుకోవ డమే తప్ప శరీర వ్యామోహమే లెనివానికి గదాధర్ ఛటోపాధ్యాయ నామకరణం చ...