ఆప్యాయత

అనగనగ ....ఒక ఊరు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు, ఆయన ప్రతిరోజు ఆయనకు కావలిసిన బియ్యం,కూరలు,చింతపండు,పప్పుదినుసులు,తెచుకుని వండుకుని తినేవాడు .అయ్యనకు నాలుగు కోడి పిల్లలు దొరికాయి , వాటికీ రామకోడి ,లక్ష్మన కోడి ,పెధనపసాని కోడి ,గజరజకోడి ,అని పేరులు పెట్టాడు .వాటిని రోజు ఎంతో ప్రేమగా సాకి పెంచేవాడు .వాటికీ రోజు అన్నం వేసే వాడు .ప్రతి రోజు ఒక దొంగ వాటిని గమనిచేవాడు .ఒక రోజు దొంగ ఆ బ్రాహ్మణుడు బయటకు వెళ్లి నపుడు వాటిని బ్రాహ్మణుడి మాటలా మాటమార్చి పిలిచి ఒక సంచీలో వేసుకుని వెళ్ళిపోయాడు .ఆబ్రాహ్మణుడు వచ్చి భోజనం కోసం వాటిని పిలిచాడు ఎంత పిలిచినా అవి రాలేదు . వాటి కోసం తిరగని ఇల్లులేదు ,వాటిని అంతగా మమకారం పెంచుకున్నాడు .ఆ దొంగ వాటిని ఒక బుట్ట కింద దాచాడు .అవి ఆ బ్రహ్మ్నాడు అటుగా వెళుతూ వాటిని పిలిస్తున్న మాటలు వాటికీ వినిపించాయి .అంతే వెంటనే వాటికీ కొండత బలంతో ఆ బుట్టని ఎగురవేసి అతని వద్హకు పరిగెత్తుకుని వచ్చి అతని చుట్టూ తిరుగుతూ ఇంటికి చేరుకున్నాయ్.

ఆప్యాయత ఎవరినిఅయిన కట్టి పడేస్తుంది .జీవుల మధ్య తేడా చూడదు .

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము