(Telugu) సుబుద్ధి-దుష్టబుద్ధి కథ
[:te]పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి, దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొనిరావాలని ఇల్లు విడిచి వెళ్ళారు. దారిలో వారికి ధనంతో నిండి ఉన్న బిందె ఒకటి దొరికింది. దానిని తీసుకొని ఇద్దరూ ఆ ధనాన్ని చెరిసగం తీసుకుందామని ఇళ్ళకు బయలుదేరారు. పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి బయట ఒక చెట్టు కింద వారాబిందెను పాతి పెట్టి ఏదో ఒకరోజు మరల అదే విధంగా ఇద్దరూ వచ్చి బిందెను తీసుకొని పోవచ్చని, అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానం రాదని, అసూయ కలగదని వారు నిర్ణయించుకొని ఎవరిళ్ళకు వారు వెళ్ళారు.
దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణేలు మొత్తం తానొక్కడే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత సుబుద్ధి వచ్చి "మిత్రమా! మనం దాచిన ధనం గల బిందెను తెచ్చుకుందాం రా" అన్నాడు. దుష్టబుద్ధి అతని వెంట బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ చెట్టు కింద తవ్వారు. ఎంత తవ్వినా ఎంత వెదికినా బిందె కనపడలేదు. దుష్టబుద్ధి సుబుద్ధితో "దుర్మార్గుడా! నన్ను మోసం చేస్తావా! ఇక్కడ దాచిన బిందె ఏమౌతుంది? నీవు నాకు చెప్పకుండా ముందుగానేవచ్చి తీసుకొని పోయి ఏమీ ఎరుగని వాని వలే నాటకమాడుతున్నావా?" అని కోపంగా పలుకగా సుబుద్ధి మిత్రమా! దేవుని సాక్షిగా నాకేమీ తెలియదు. మన రహస్యము ఇంకొకరికి తెలిసే అవకాశమే లేదు. బిందేమైందో, ఎవరు కాజేశారో! అంతా వింతగా ఉంది అనగా "నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు. మర్యాదగా నా వాటా ధనం నాకు ఇవ్వు! లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా" అని దుష్టబుద్ధి అతణ్ణి బెదిరించాడు. సుబుద్ధికి ఆ మాటలు ఎంతగానో బాధ కలిగించాయి. అపుడు సుబుద్ధి "నా మాట నమ్మనిచో నేనేం చేయగలను? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, అన్నిటికీ ఆ భగవంతుడిదే భారం" అని అతడు చెప్పాడు.
దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు ఉభయుల వాదన విన్నాడు. అపుడు రాజుగారుదుష్టబుద్ధితో సుబుద్ధే ఆ ధనం కాజేశాడంటున్నావే? దానికి సాక్ష్యం ఏమైనా ఉందా? అన్నాడు. "మహారాజా! న్యాయం దాచిపెడితే దాగేదా? బిందెలు పాతిన చోట చెట్టు ఉంది కదా! ఆ చెట్టే సాక్షి, సుబుద్ధియే ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎదుట నిజం చెపుతుంది. విచారణ చేసి నాకు న్యాయం చేయండి" అని దుష్టబుద్ధి రాజును బతిమాలాడు. ఆ మాటలకు రాజు గారితో పాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. చెట్టు సాక్ష్యం చెప్పడమేంటని? ఈ చిత్రమేమిటో రేపు చూద్దాం" అనుకున్నాడు రాజు.
దుష్టబుద్ధి ఇంటికి వచ్చి ముసలి వాడిన తన తండ్రికి రాజుగారి కొలువులో జరిగిన సంగతి వివరించి, "నాన్నగారూ! చేజిక్కిన ధనమును పరులకెలా దక్కనీయాలి? నీవు ఒక్క మాట చెప్పినట్లయితే ఈ ధనమంతయు మనదే అగును. సుబుద్ధి గాడికి శిక్ష పడును. ఏ ఆపద లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు. ఆ చెట్టుకు మనిషి పట్టేంత తొర్రజ ఉంది. అది బయటకు కనిపించదు. చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప ఎవరికీ తెలియదు. నీవీరాత్రి ఆ చెట్టు తొర్రలో దూరి రహస్యంగా కూర్చో. రేపు రాజు వచ్చి ప్రశ్నించగానే "ఇచట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు. దుష్టబుద్ధికి ఏమీ తెలియదు" అని చెప్పమన్నాడు.
ఆ మాటలకు తండ్రి "ఓరీ నీచుడా! నీకు చెడు కాలము దాపురించినట్లుంది. లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగునా? ముందు వెనుక ఆలోచింపక పనిచేయువాడు ఇంతకు మునుపు పామును చేరుపబోయి తాను చెడిన కొంగ వలే హాని చెందును. నీకా కథ చెపుతాను విను" అని కథ చెప్పటం ప్రారంభించాడు.
[:]

Comments
Post a Comment