(Telugu) రంజాన్ మాసంలో ఖర్జూరాలు ఎందుకు!
[:te]రంజాన్ మాసం రాగానే అందరికీ ఖర్జూరాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే ముస్లిం సోదరులంతా రంజాన్ రోజున ఉపవాసాన్ని ఉండి, సాయంత్రం పూట ఆ ఉపవాసాన్ని ఒక ఖర్జూరాన్ని తీసుకోవడంతో ముగిస్తారు. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్తే ఇలాంటి ఆచారాన్ని పాటించేవారని చెబుతారు. ఇస్లాం రూపుదిద్దుకున్న ఎడారి నేలల మీద ఖర్జూర పుష్కలంగా పండే పండు కావచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే, రంజాన్ ఉపవాసపు ముగింపుగా ఖర్జూరన్నే ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే కనిపిస్తాయి. - పగలంతా ఉపవాసం ఉన్నవారిలో చక్కెర నిల్వలు పడిపోతాయి. నీరసం, నిస్సత్తువా ఆవహిస్తాయి. ఇలాంటివారికి తిరిగిన శక్తిని అందించే ఔషధంగా ఖర్జూర పనిచేస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరలో 50 గ్రాములకి పైగా చక్కెర ఉంటుంది. ఇందులో మనిషికి తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ కూడా అధికంగానే ఉంటుంది. -రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఖర్జూరలో కావల్సినన్ని పోషకాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఇందులో 6 రకాల విటమిన్లూ, 15 రకాల ఖనిజాలూ ఉన్నాయి. కాబట్టి రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటేనే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుందని...