(Telugu) మదర్ థెరిసా మంచి మాటలు
[:te] మీరు ప్రేమ లేకుండా అద్భుతాలు చేసే కంటే ,ప్రేమతో తప్పులు చేయుటయే కోరుకుంటున్నాను. "మౌనం యొక్క ఫలితం ప్రార్ధన ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం నమ్మకం యొక్క ఫలితం ప్రేమ ప్రేమ యొక్క ఫలితం సేవ సేవ యొక్క ఫలితం సంతృప్తి."దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది.మనుష్యులలో తప్పొప్పులు చూస్తూవుంటే ఒకరోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు. మీరు చేసే తప్పు కూడా పునీతమవుతుంది, ఆ తప్పను మీరు ఒప్పుకుంటే. ప్రేమ అనేది మాటలలో వచ్చేది కాదు. ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నాను. కరుణ గల మాటలు తేలికైనవి. మాట్లాడేందుకు అనువైనవి. చిన్న విషయాలు కదా అని అలక్ష్యం చూపకు. ధృడనిశ్చయం అనేది అక్కడే నిద్రావస్థలో వున్నది. పేదల యొక్క పేదరికపు రూపంలో దర్శనం ఇచ్చే యేసు ప్రభువుకు సేవను చేయండి. నూనె వేస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. మనం ప్రేమ చూపిస్తుంటేనే మనపైన ప్రేమ అనే ప్రకాశం పడేది. మంచిని చెయ్యుట మీ ఇంట్లోనో,పాఠశాలలోనో,పనిలోనో చెయ్యనారంభించండి. రొట్టెల కోసం పరితపించే వాడి కంటే, ప్రేమకోసం పరితపించే వాడి పరిస్థితే పరితపించదగినది. మనకు ఒకరు స...