(Telugu) శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు
[:te]తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి లోకాన్ని తరచి చూసిన అనుభవాన్ని నాలుగంటే నాలుగు వాక్యాలలో పాఠకులకు అందించేదే శతక పద్యం. ఈ శతకాల గురించి ప్రస్తావన రాగానే ముందు వేమన శతకమే గుర్తుకువస్తుంది. కానీ వేమనకు ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజలను ఉర్రూతలూగించిన శతకం సుమతీ శతకం! నిజానికి సుమతీ శతకం ఎవరు రాశారన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. వేమన, గువ్వల చెన్నా లాంటి శతకాలలోలాగా ఎక్కడా కూడా శతకకారుని ప్రస్తావనే కనిపించదు. కానీ చాలామంది అభిప్రాయం మేరకు ‘భద్ర భూపాలుడు’ అనే వ్యక్తి ఈ పద్యాలను రాసి ఉంటాడు. ఈయననే బద్దెన అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని అనువదించిన తిక్కన మహాకవికి ఈయన శిష్యుడని ఓ నమ్మకం. బద్దెన 13 శతాబ్దంలో జీవించాడు. ఒకవేళ ఈయనే కనుక సుమతీ శతకాన్ని రాసి ఉంటే... తెలుగులో శతక సాహిత్యానికి నాంది పలికిన కవులలో ఈయన ఒకరై ఉంటారు. నలుగురికీ మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో బద్దెన ఈ శతకాన్ని రాసినట్లు అర్థమవుతుంది. అందుకే ఈ శతకంలోని ప్రతి పద్యంలోనూ ‘సుమతీ’ (మంచి బుద్ధి కలవాడా) అన్న మకుటం కనిపిస్తుంది. భద్రభూపాలుని కాలం అటు రుద్రమదేవి కాలంతో...