(Telugu) వడ్రంగి-సింహం కథ
[:te]ఒక ఊరిలో వడ్రంగి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకొని, వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఒకనాడు అతనికి సింహం ఎదురైంది. సింహాన్ని చూచి వడ్రంగి గజగజ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు సింహం "నీవెందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమీ చేయనులే" అన్నది. వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకొని రెండు అడుగులు ముందుకు వేసి తన వద్దనున్న అన్నం, కూరలు సింహం ముందు పెట్టాడు. ఆనాటి నుండి వడ్రంగి, సింహం మంచి స్నేహితులయ్యారు. అతడు ప్రతిరోజూ సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చి పెట్టసాగాడు. పండుగలకూ, పబ్బాలకూ పిండి వంటలు కూడా తెచ్చి పెట్టేవాడు.
కొన్నాళ్ళు జరిగిన తరువాత సింహానికి ఒక కాకి, నక్కతో స్నేహం ఏర్పడింది. అది వాటికి తన స్నేహితుడైన వడ్రంగి గురించి గొప్పగా చెప్పింది. అవి అతనిని తమకు చూపించమని కోరాయి. ఒకనాడు వడ్రంగి వచ్చేవేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకొని అక్కడకు వచ్చింది. సింహం వెనుక కాకి, నక్క ఉండటం చూచి వడ్రంగి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతని వింత ప్రవర్తనకి సింహం ఆశ్చర్యపోయింది. మిత్రమా! వీళ్ళు నా కొత్త స్నేహితులు, నీక్కూడా మిత్రులే, భయపడవలసిన పనేమీ లేదు. చెట్టు దిగివచ్చి మా ముగ్గురికీ నీవు తెచ్చిన పదార్థములు పెట్టి మమ్ములను సంతోషపెట్టుము" అని అన్నది.
వడ్రంగి సింహంతో మిత్రమా! ఉన్నతులూ, ఉత్తములూ అయిన వారితోనే స్నేహముచేయాలి. నీవు మృగరాజువని నీతో స్నేహం చేశాను. కాని నీవు నీ కన్నా తక్కువ జాతివారైన నక్క,కాకితో స్నేహం చేశావు. దీనితో నీ గొప్పతనం దిగజారిపోయింది. పైగా ఈ నక్క జిత్తుల మారిది, కాకి అరిష్టానికి పేరు పొందినది. కాకి వాడియైన తన ముక్కుతో, నక్క కుటిలమైన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తాయి. ఇటువంటి దుష్టులతో నీవు స్నేహం చేశావు. కనుక ఇకనుండి నేను నీతో స్నేహం చేయను అని చెప్పాడు. సింహం సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. వడ్రంగి కూడా చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
అగ్నిదేవుడెంతో శక్తి గలవాడు. ఆయన గాలి దేవునితో స్నేహం చేసి ఇంకా తన శక్తిని రెట్టింపు చేస్తూ ఎంతగానో ఎదిగిపోతారు, ఎంతోగానో ప్రకాశిస్తాడు. నిముషాలమీద లోకాలన్నీ భస్మం చేయగలుగుతాడు. అలాకాక తనకంటే తక్కువ వాడైన ఇనుముతో స్నేహం చేస్తే సమ్మెట దెబ్బలు తింటాడు. చివరకు నీటిలో తన శక్తిని కోల్పోయి పూర్తిగా చల్లారిపోతాడు. అందువలన అన్ని వేళలా మంచివారితోనే స్నేహం చేయమని పెద్దలు చెపుతూ ఉంటారు. కథలో మనరాజు కూడా ఎవరో దుర్మార్గుల జట్టు చేరినాడు. ఆ దుర్మార్గులే నాపై లేనిపోని నేరములు చెప్పి నమ్మించి ఉంటారు. ఆ మాటలు విని, అవి నిజమని నమ్మి నన్ను చంపదలచినచో ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉన్నదా? ఏది ఏమైనా కాని అటువంటి రాజులకు లోబడి ఉండుట కంటే ధైర్యంగా వారిని ఎదురించి పోరాడతాను. విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటాను. అని సంజీవకుడు పలుకగా దమనకుడు తన తంత్రము చక్కగా పని చేసిందని లోలోన సంతోషించి "సంజీవకా! నీ నిశ్చయము మెచ్చుకోతగినదే, కాని పింగళకుడు నీ కంటే ఎంతో బలవంతుడు. మహా పరాక్రమవంతుడు. అట్టి బలవంతునితో విరోధము మంచిది కాదు. బలవంతుడైన శత్రువును ఉపాయంతో జయించాలి. మునుపు తీతువుపక్షి సముద్రుణ్ణి జయించింది. అనగా సంజీవకుడు 'ఆ కథ ఏమిటో చెప్పు" అనగా దమనకుడు ఈ విధంగా చెప్పసాగాడు.
[:]

Comments
Post a Comment