(Telugu) భోగి పండ్లు ఎందుకంత ప్రత్యేకం!
[:te]సంక్రాంతి వస్తోందనగానే భోగిపండుగే గుర్తుకు వస్తుంది. భోగినాడు ఉదయం వేళ కుర్రకారుకి భోగిమంటలు, సాయంవేళల్లో పిల్లలకి భోగిపండ్ల సంప్రదాయం పూర్తికాకపోతే పండగంతా వెలితిగా తోస్తుంది. ఇంతకీ ఈ భోగిపండ్లకి ఎందుకంత ప్రాముఖ్యత అంతే బోలెడు సమాధానాలు కనిపిస్తాయి. - పిల్లలకు భోగిపండ్లుగా వినియోగించేందుకు చిన్న రేగుకాయలను వాడతారు. ఈ రేగుకాయలకు బదరీఫలం అన్న పేరు కూడా ఉంది. పూర్వం నరనారాయణులు ఈ బదరికావనంలోనే శివుని గురించి ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందట. - రేగుపండుని అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడే! సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. భోగిమర్నాడు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారతాడు. అలా సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి... ఆ సూర్యభగవానుని ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారని కూడా ఒక విశ్లేషణ ఉంది. బహుశా అందుకనే భోగిపండ్ల వేడుక సూర్యాస్తమయం లోపలే ముగించడం మంచిద...