Posts

Showing posts with the label ఆద్యాత్మికం

పరాశరస్మృతి

అన్యే కృతయుగే ధర్మా: త్రేతాయాం ద్వాపర యుగే అన్యే కలియుగే న్రూణా౦ యుగాపానుసారత: - ఆయా యుగాల స్వరూప స్వభావభేదాలననుసారించి అన్ని యుగాలలోను ధర్మాలు భిన్నభిన్నంగా ఉంటాయి తప: పరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమేవాహు: దానమేవ కలౌయుగే !! – కృతయుగంలో మానవధర్మం తపస్సు, త్రేతాయుగం లో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం అయితే కలియుగ ధర్మం దానం పరాశరస్మృతి – ఉపోద్ఘాతము “కృతేతు మానవాధర్మాః త్రేతాయాం గౌతమస్మృతాః ద్వాపరేశంఖలిఖితాః కలౌ పరాశరాఃస్మృతాః” – మనుస్మృతి కృత యుగానికి, అలాగే కలియుగానికి పరాశర స్మృతి అన్నది ఆర్యోక్తి. కానీ కొందరు దుష్టులు కొన్ని వేల ఏళ్ళ క్రితం నిర్దేశింపబడిన మనుస్మ్రుతిని పట్టుకుని అదే హైందవం అంటూ ఎగతాళి చేస్తున్నారు. అసలంటూ కొన్ని కొన్ని జాతులలో బట్టలు వేసుకోవడం నేర్వని కాలంలో, గొర్రెలు, అడవిపందులు తింటున్న కాలంలో, వావి వరసలు లేక పశువుల్లా అందరితో జత కడుతున్న సమయానికి మన సంస్కృతిలో ధర్మం, దిశానిర్దేశం అన్నీ ఉన్నాయి. అవి ఆ కాలానికి సరిపడ్డ నియమాలు. కాలప్రవాహంలో మార్పు సహజం. ఆ మార్పు చాలామటుకు మంచికి దోహదపడుతుంది. సమయానికి సరిపడ్డ ధ...

శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడం లో అంతరార్ధం ఏమిటి?

కొందరు పెద్దలు కవి హృదయంతో నెమలి లైంగిక కార్యక్రమంలో పాల్గొనకుండా సంతానం పొందే ఏకైక పక్షి అని చెప్పిన విషయాన్ని చిలవలు పలవలు చేసి మొత్తానికి వేదాన్నే తిరస్కరించాలి అని కుసంస్కారులు ప్రచారం ప్రారంభించారు. అసలు కృష్ణ తత్త్వమే తప్పని తీర్మానించేసి చంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఆయన ధరించినది నెమలిని కాదు నెమలి పింఛాన్ని. నెమలి పించ్హానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసేదే శ్రీ కృష్ణ తత్త్వం నెమలి పింఛానికి ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనబడే అన్ని రంగుల సప్తవర్ణ సమాహారం అందులో ఉంటాయి. ఈ లోకమంతా ఆకాశం ఆవరింపబడి ఉంటుంది. పగలు నీలం రంగులోను,రాత్రుళ్ళు శ్యామ వర్ణంలోను కనబడుతుంది. సూర్యోదయానికి ఒక రంగు,అస్త్యమయానికి మరొక రంగు, మండుటెండలో మరొక రంగు కనబడుతుంది. అన్ని రంగులు ఒక సమాహారంగా కనబడేది నెమలి పించంలోనే. కాలానికి ప్రతీక ఆ నెమలి పించం. కృష్ణపక్షం,శుక్ల పక్షం పరంగా కాలమంతా ఈ రంగుల మయమే. మనలో ఉన్న మంచి,చెడు అన్ని రకాల ఆలోచనా తరంగాలు ఈ ఏడు రంగుల ద్వారానే ప్రకటితంఅవుతాయి. ఆ పించం మాయకు ప్రతీక ప్రకృతికి మరొక ప్రతీక ఆ నెమలిపించం ఒక న...

ప్రసిద్ధమైన ముక్కు తిమ్మన పద్యం

నానా సూన వితాన వాసనలనానందించు సారంగమే- లా నన్నొలదటంచు గంధఫలి బల్కాకన్ తపంబంది యో- షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్. సారంగము = మధుకరీ = తుమ్మెద నన్నొల్లదు = నన్ను స్వీకరించదు గంధఫలి = సంపెంగ పూవు బల్కాకన్ = పలు + కాకన్ = చాలా కొపంతో

గజేంద్ర మోక్షణం

అడిగెదనని కడు వడిఁ జను- నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడఁ బడ నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్ర మోక్షణ ఘట్టం. భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'. `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?

ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆదిపరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది.అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమత నుండి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లోపాలుతప్పక పొంగిస్తారు.....

విభూతి ఎందుకు రాసుకుంటారు ?

నెయ్యి, పలురకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు.... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలూ, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు.అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది....

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్ర లేవాలి ?

Image
నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాలను గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది. మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తల వరకు, తలనుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమవైపు నుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూలదిశగా మన శరీర కదలిక వల్ల  రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది. ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది. పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమ వైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు. కాబట్టి పెద్దల మాట పాటించడం ఉత్తమం.

విష్ణువు వేయి నామాలు మరియు వాటి అర్థం.............

Image
1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3) వషట్కార: - వేద స్వరూపుడు. 4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు. 5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు. 6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు. 7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు. 8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు. 9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు. 10) పూతాత్మా - పవిత్రాత్ముడు. 11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు. 12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు. 13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు. 14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు. 15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు. 16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు. 17) అక్షర: - నాశరహితుడు. 18) యోగ: - యోగము చే పొందదగిన వాడు. 19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు. 20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత. 21) నా...

శ్రీ యంత్రం – గణిత లక్షణాలు

Image
మన వాజ్మయం లో శ్రీ యంత్రం కున్న స్థానం ఎంతో విశిష్టం. శ్రీ విద్యోపాసకులకు, తంత్ర శాస్త్ర ప్రవీణులకు ఈ యంత్ర నిర్మాణం వాటి గొప్పదనం గురించి వివరణ కరతలామలకం. శ్రీయంత్రాన్ని ఆధారం చేసుకుని శ్రీచక్ర నిర్మాణం, శ్రీ చక్రార్చన మన పూర్వులు ఎప్పటినుండో చేస్తున్నారు. ఈ శ్రీ యంత్ర నిర్మాణం ఎన్నో శతాబ్దాలుగా విదీశీయ పరిశోధకులకు అంతుబట్టని అంశం. ఎందరినో పరిశోధనకు ఉద్యుక్తులను చేసింది. ఎందరో ప్రయత్నించి వారు పొడుపు కధ విప్పామని చెప్పగాని దాన్ని మరొకరు ఖండించి దానిలో లోపాన్ని చూపేవారు. ఎన్నో దశాబ్దాల పరిశోధన అనంతరం ఈ యంత్ర విశేషాలను వారు కనుకొని అచ్చెరువొందారు. కొన్ని అంతర్జాతీయ సాంకేతిక ప్రచురణలు శ్రీ యంత్రం మీద సాగిందంటే మీరు ఆశ్చర్యపోకమానరు. వాటిలో మనకు లభ్యమవుతున్న ఒక సాంకేతిక ప్రచురణ శ్రీ అలెక్ష్ కులైచేవ్ అణు రష్యా పరిశోధకుడు 1983 లో ప్రచురించిన శ్రీయంత్ర గణిత లక్షణాలు అనే పేపర్. దాన్ని ఆధారంగా చేసుకుని మరెందరో ప్రచురించారు. తమ పరిశోధనకు శృంగేరి పీఠం లో వున్నా శ్రీయంత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అధర్వణవేదములో శ్రీ యంత్రం గురించిన శ్లోకాలను బట్టి దాని నిర్మాణం వారికి అర్ధమయింది. సరిగ్గా శ్ర...

గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

*స్కందోత్పత్తి* 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! 8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! 9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన! ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్! అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన! శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! 12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః! గర్భం ధార...

జపము - జపమాల ప్రాశస్త్యం

Image
జపము - జపమాల ప్రాశస్త్యం జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః | జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే || 'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది. జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం. మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం. పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం. ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం. వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం. "న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం. యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః | జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః || జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు | జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం || యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూ...

శ్రీకృష్ణ మంత్రసాధన

Image
శ్రీకృష్ణ మంత్రసాధన సప్తాహం కృష్ణాష్టమి మొదలు అమావాస్య వరకు 7 రోజులు మంత్రసాధనకు ఎంతో ముఖ్యమైనవి అని చెప్పవచ్చు.  ఈ మంత్రసాధనకు ముందు ఒక్కసారి శ్రీకృష్ణుడు చేసిన ముఖ్యమైన లీలలు (మహిమలు) కొన్ని పరిశీలన చూద్దాం. పసిబాలుడుగా ఉన్నప్పుడే  పూతన, శకటాసురుడు, తృనావర్తుడు మొదలైన వారిని, కొంచెం పెద్ద అయ్యాకా కంసుడు మొదలైనవారిని, కాళీయ మర్దనం , గోవర్ధన పర్వతం ఎత్తడం, గురుపుత్రుడిని తీసుకురావడం, తరువాత పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, కాలయవనుడు మొదలైన వారిని సంహరించడం , తరువాత  ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో,  పాండవులు అరణ్యవాసంలో అనేకసార్లు, తరువాత కురుక్షేత్ర యద్ధంలో యద్ధం పూర్తి అయ్యాక అభిమన్య కుమారుడు అయిన పరీక్షిత్తుని ప్రాణాన్ని కాపాడడం, యద్ధం పూర్తి అయ్యాక ధ్రుతరాష్ట్ర కౌగలి నుంచి భీముని కాపాడడం వరకు  ఆయన లీలలు అనేకం. వీటిలో కొన్నిటిని తీసుకుని వాటిని మంత్రశాస్త్ర పరంగా అనుసంధానం చేసి మంత్రసాధన చేసి మనకు ఉన్న ఇబ్బందులు తొలిగించుకోవచ్చు.  మనం ముందే అనుకున్నట్టు శ్రీకృష్ణుడు జగద్గురువు.  గురువు అనగా అంధకారం తొలిగించేవాడు.  భౌతిక జీవితంలో మన మనసుకు కమ్మిన మాయవ...

వేణుగోపాలుని మీసం ఆపద్ధర్మం

Image
వేణుగోపాలుని మీసం ఆపద్ధర్మం తెలంగాణలోని చెల్లాపూర్‌ గ్రామంలో మీస మాధవుడు కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న ఆలోచన చేశారు.   రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ విగ్రహాన్వేషణ చేశారు. రామ్‌గోపాల్‌పేట అనే గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. దాన్ని తెచ్చి, ప్రతిష్ఠించాలనుకుంటూండగా, రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని తెలిసింది. దీంతో విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు. విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట వారు గుర్తుపట్టకుండా... దాని తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో మీ...

వారణాసి కాశీి వైభవం

Image
*వారణాసి కాశీి వైభవం* కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం: # కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. # విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. # ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. # స్వయంగా శివుడు నివాసముండె నగరం. # ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. # కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. # పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. # కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.... # ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశీ లోనికి అనుమతించడు. # కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు. # కాశీ ప్రవ...

భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా..

మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి. - మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. - స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. - ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.

వృక్ష దేవతలు

Image
వృక్ష దేవతలు హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం. తులసి తు...