Posts

Showing posts with the label పూజా విధానం

పూజా విధానంలో అంతరార్థము

🔔1. గంటలు :- దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది. ♨2. దీపహారతి:- దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని. ♨3. ధూపం :- భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది. ♨4. కర్పూర హారతి :- వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్...

మనము చేసే సాధన పూజలలో ఆటంకాలు ఎందుకు వస్తాయి

1.అక్రమార్జితం ఉన్న 2.ఇంటిలో శుచిగా లేక 3.పెద్దలనుదూషించటం 4.నమ్మకం లేకపోవటం 5.పరనింద 6.ఆసన శుద్ధి లేక 7.నిచులతో స్నేహం 8.పరనిందాసాక్తి 9.కుట్టిల బుద్ది 10.కోరారాని కోరిక కోరడం

ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు ...

సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి. పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి...

భగవంతుణ్ణి పూజించే విధానాలు

భగవంతుణ్ణి  పూజించే విధానాలలో  మనకు  16 ఉపచారాలు మాత్రమే తెలుసు  మరింత సమగ్రంగా తెలుసుకుందాం 🙏ఉపచారాలు🙏 సంక్షేపం విస్తారం అని షోడశోపచారాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, ముప్ఫైఆరు, అరవైనాలుగు. అవి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. ☀ పంచోపచారాలు: 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం ☀ దశోపచారాలు: 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం ☀ షోడశోపచారాలు: 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం ☀ అష్టాదశోపచారాలు 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం   ☀ ముప్ఫైఆరు ఉపచారాలు 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘ్యం...

పూజ ఎందుకు చేయాలి?

Image
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడ...

పూజ

పూజ అంతే ఏమిటి? భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా లేదా `అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి... ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు. దేముడిని నమ్మి రోజూ పూజలూ, ప్రార్థనలూ చేస్తూ ఉండే వారు ఆస్తికులు. దేముడు లేడని నమ్మి ఎటువంటి పూజలూ, ప్రార్థనలూ చేయని వారు నాస్తికులు. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ఇరు వర్గాల వారూ భగవంతుని కృపకు పాతృలవుతున్నారని. ఆస్తికత అయినా, నాస్తికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే. రెండు మన శక్తిని పెంచేవే.నిజమైన నాస్తికత్వం ఆస్తికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుక...