క్షౌర కర్మ
క్షౌర కర్మను గురించి శాస్త్రము ఒక క్రమ పద్దతిని నిర్దిష్టించినది . (a) శ్మశ్రూణ్యగ్రే వాపయతే అథోపకక్షావథ కేశానాథ లోమాన్యథ నాఖాని | . (b) అథైతన్మనుర్వప్త్రే మిథునమపశ్యత్ | స శ్మశ్రూణ్యగ్రే అవపత్ | అథోపకక్షౌ అథకేశాన్. తాత్పర్యము: ముందుగా గడ్డమును కుడి ప్రక్కనుండి ప్రారంభించి పూర్తి చేయవలెను . పిమ్మట మీసములను , కక్షము (చంకలు) , పిదప తల వెంట్రుకలను కత్తిరించ వలయును చివరగా గోళ్ళను కత్తిరించుకొనవలెనని విధానము చెప్పబడినది . తూర్పు కాని ఉత్తర ముఖముగా కూర్చొని చేయించుకోవలెను క్షౌరకర్మ చేయించుకోకూడని సమయాలు : (తిథులు) 1) పాడ్యమి 2) షష్టి 3) అష్టమి 4) నవమి (శుక్ల పక్షము ) 5) ఏకాదశి 6) చతుర్దశి 7) పౌర్ణమి 8) అమావాస్య 9) జన్మ నక్షత్రం ఉన్న రోజు 10) సూర్య సంక్రమణం నాడు 11) వ్యతీపాతం 12) విష్టి (భద్ర ) (రోజులు - సమయములు ) - చెయ్యక...