కేశవ నామాల విశిష్టత
మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ కేశవాయనమః,,నారాయణాయనమః,, మాధవాయనమః అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము. 1. ఓం కేశవాయనమః (శంఖం చక్రంగద_పద్మం) బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు. 2. ఓం నారాయణాయనమః (పద్మంగదచక్రం_శంఖం) నాశరహితుడైనందువల్ల విష్ణువ...