Posts

Showing posts with the label తెలుగు నెలలు – ధనుర్మాసము

ధనుర్మాసం

ధనుర్మాసం - ఈ నెలరోజులు బాలికలు,మహిళలు  తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ ముగ్గులు పెట్టి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో  అమ్మవారిని పూజించుతారు చివరరోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు  .(ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ) హరి దాసులు (మాల దాసరులు హరిమాల ధరించిన వారు వీరినే మాలలు అని ప్రస్తుతం పిలుస్తున్న హరిభక్తులు) వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ  ఇంటింటికి తిరుగుతారు.చివరలో గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. వాటికి కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్  పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి  కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని  ...

ధనుర్మాసము

Image
విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం . భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు . ధనుర్మాసం అంటే ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట . ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు . ప్రతీ...