Posts

Showing posts with the label చక్ర భ్రమణం

చక్ర భ్రమణం

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... ఇది ‘యుగచక్రం’. వర్షకాలం, చలికాలం, ఎండకాలం... ఇది ‘రుతుచక్రం’. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... ఇది ‘కాల చక్రం’. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఇది ‘జీవిత చక్రం’. సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. రంగులరాట్నంలో కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు... ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి. ఈ సత్యం తెలిసికూడా మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి నిరంతరం బాధపడుతుంటాడు. జీవిత ప్రయాణం అంటే- గమ్యం వైపు గమనం. ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న! గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. ఆ కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి. ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ‘ఎంత’ అనేదానికి ‘అంతు’ ఉందా? చాలామంది విషయంలో లేదు, ఉండదు! మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను, యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది. జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు. ఇంకా ధ...