(Telugu) ఇలా ఆదా...

[:te]కాకరకాయలూ దొండకాయల వంటివి త్వరగా పండిపోతుంటాయి. బెండకాయలూ, బీరకాయలూ ముదిరిపోతాయి.ఇలాంటి కాయగూరల్ని ముక్కల్లా డబ్బాలో ఉంచితే కూరగాయలు అందుబాటులో లేనప్పుడు పప్పులో వేసి వండుకోవచ్చు.
*ఒక్కోసారి చపాతీలూ, పూరీలూ, పుల్కాలూ మిగిలిపోతుంటాయి. మళ్లీ కాల్చినా అంత రుచిగా ఉండవు. అలాంటప్పుడు బెల్లం లేదా పంచదారపాకం పట్టి అందులో యాలకుల పొడి వేసి.. వీటిని ముక్కల్లా చేసి పాకంలో వేయాలి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది మిగిలపండిన అరటిపండ్లను తినరు. అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు చేత్తోమెదిపి ఉండలా చేసుకుని, గరిటెజారుగా కలిపిన మైదాపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి. కరకరలాడే అరటిపండు బజ్జీలు సిద్ధమయినట్టే.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము