Posts

Showing posts with the label బోధివృక్షం

బోధివృక్షం

Image
బోధించటం అంటే ఆత్మజ్ఞానాన్ని మాటల్లో పదిలంగా అందించటం. అలాంటి బోధను చెవులతో మాత్రమే వినకూడదు. మనసు, బుద్ధి, ఆత్మతో కలిపి వినాలి. అంటే- ఇంద్రియాలను ఏకీకృతం చేసి, ప్రతి వాక్కును పొల్లుపోకుండా అందుకోవాలి. మనసును భిక్షాపాత్ర చేసుకోవాలి. బుద్ధితో ఆ పాత్రను పదిలంగా పుచ్చుకోవాలి. బోధ కేవలం జ్ఞానులే చేయగలుగుతారు. జ్ఞానం అంటే భగవంతుడి హృదయకోశంలో ఉన్న ప్రేమామృతం. దానికి అక్షర రూపం కల్పిస్తే జ్ఞానం అవుతుంది. 'అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు... అందరిలోను నేనే ఉన్నాను' అనేది పరమాత్మ ప్రపంచానికి ఇచ్చే జ్ఞానబోధ. దీన్ని మహర్షులు అందుకోగలిగారు. మరెందరో మహాత్ములూ అందిపుచ్చుకోగలిగారు. వారే ప్రపంచానికి ప్రేమను బోధిస్తున్నారు. దానికి అనేక రూపాలు కల్పిస్తున్నారు. పంచదారతో ఎన్నెన్నో మధుర భక్ష్యాలు చేస్తారు. అన్నింట్లో ఉండే మూలపదార్థం తియ్యదనమే కదా? అలాగే, బోధలన్నింటి మూలపదార్థం ప్రేమ ఒక్కటే. ఆహరహం చెదరని ప్రేమను భక్తి అంటారు. భక్తిలో సంపూర్ణత్వం సాధిస్తే అది పరమ భక్తి అవుతుంది. పరమ భక్తుల హృదయ కమలంలో అంతర్యామి ఆనంద పారవశ్యంతో సేద తీరుతుంటాడు. ఆంజనేయుడు తన రాముణ్ని హృదయ కమలంలో అనుక్షణం వీక్షిస్...