Posts

Showing posts with the label పౌర్ణమి

శ్రావణ పూర్ణిమ

ఋతువులను అనుసరించి ప్రతి పనినీ ప్రారంభించే మన పూర్వులు, విద్యను ప్రారంభించేందుకూ, ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు. అదే 'శ్రావణపూర్ణిమ.' ఈ రోజున ద్విజులు అధ్యాయోపకర్మలు చేస్తుండేవారు. అదే నేటికి 'ఉపాకర్మ'గా మారింది. అధ్యాయోపకర్మ అంటే వేదాధ్యయనప్రారంభం. ఇది ద్విజులందరికీ వున్నప్పటికీ, నేటి కాలంలో బ్రాహ్మణులే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనిషత్తుల ఆద్యంతవాక్యాలను పఠించి, ఇంట్లో హోమాలు చేస్తారు. మరునాడు ఉపాకర్మకు అనుబంధంగా 1008 మార్లు గాయత్రీమంత్రజపం చేస్తారు. సామవేదులు విఘ్నేశ్వరచతుర్థి నాడు, ఆయనను విద్యాధిదేవతగా భావించటం వల్ల, ఉపాకర్మ జరుపుకొంటారు. ఇవి నేటికి లాంఛనప్రాయంగా మిగిలిపోయాయి. పూర్వం వేదకర్మాలను ఆచరించేటప్పుడు తప్ప, మిగతా సమయాల్లో యజ్ఞోపవీతాలను నిరంతరమూ ధరించేవారు కాదు. కనుక వేదాధ్యయనప్రారంభానికి దీక్ష పూనేటప్పుడు, కొత్త యజ్ఞోపవీతాలు ధరించటం ఆచారమైంది. ఆ తరువాత ఇదే కంకణసూత్రధారణంగా మారి, మిగతా కులాలవారిలో రక్షాబంధనకర్మగా ఏర్పడివుంటుంది. రక్షాబంధనాన్ని కూడా ఇదే రోజున చేసుకోవటం వల్ల, ఈ శ్రావణపూర్ణిమకు 'రక్షా...

మాఘ పూర్ణిమ

సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ . ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము . తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది . పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసం లో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసం లో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమల లో చేసే దేవతారాధం మరింత శ్రేస్టమయినది . " మహామాఘి , అలభ్యయోగం " అని ఈ మాఘ పూర్ణిమను అంటారు .అంటే ఈ రొజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట . వైశాఖీ కార్తీకీ మాఘీ తిధయోతీవ పూజిత: స్నానదాన విహీనాస్తా ననేయా: పాండునందన . అని చెప్పబడింది . స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు . ఈ మాఘపూర్ణిమ తోపాటు ఇదే మాసం లో వచ్చే రధసప్తమి , భీష్మఏకాదశి ., మహ...

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ

Image
[:te]  ----  భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది . ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పద...

కార్తీకపౌర్ణమి

Image
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి, విశదీకరిస్తాయి, నిలువరింపజేస్తాయి. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. ఈ తరం యువత పండుగలు, పర్వదినాలు, ఒక వేడుక జరుపుకోవడానికే పరిమితం జేస్తున్నారు . పండుగల ద్వారా మన పురాణ ఇతిహాసాలు,మనకు అందించే సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలని ప్రతి పర్వదినానికి తగిన రీతిగా వాటి విశిష్టతను గురించి ప్రజలకు ,విద్యార్ధులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేయుచున్నారు . కార్తీకమాసం అంతా స్నాన, దాన, జప...

కార్తీక పౌర్ణమి

Image
శివ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు , మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్...

ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ!

కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో... - భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో, ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా త‌న చీర‌కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి ర‌క్ష‌గా చుట్టింది. `న‌న్ను అన్న‌గా భావించి ఆదుకున్నావు కాబ‌ట్టి, నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో!’ అని అభ‌య‌మిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘ‌ట‌నే ర‌క్షాబంధ‌నానికి నాందిగా నిలిచిందని చెబుతారు. త‌రువాతి కాలంలో ద్రౌప‌ది చీరను లాగి కౌర‌వులు నిండుస...

గురుపౌర్ణమి రోజు షిరిడీలో ఉంటే!

భారతీయులకు గురుపౌర్ణమి కొత్తేమీ కాదు! భారత భాగవతాది గ్రంథాలను రాసిన వేదవ్యాసుని జన్మదినాన్ని గురుపౌర్ణమిగా జరుపుతునే వస్తున్నాం. కానీ దత్తసంప్రదాయంలో ఈ పండుగకి మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే త్రిమూర్తుల అవతారం అయిన దత్తాత్రేయులవారిని ఆదిగురువుగా భావిస్తుంటారు. ఆయనను కొలిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే దత్తక్షేత్రాలు అన్నింటి వద్దా గురుపౌర్ణమిని వేడుకగా నిర్వహిస్తారు. మరి ఆ దత్తేత్రేయుని గురుపరంపరలో ఒకరిగా భావించే శిరిడీలో గురుపౌర్ణమి ఘనంగా జరగడంలో ఆశ్చర్యం ఏముంది? శిరిడీలో గురుపౌర్ణమిని సాక్షాత్తూ బాబాగారే ప్రోత్సహించారని చెబుతారు. బాబాగారి సన్నిధిలో వినాయక్‌ సాఠే అనే భక్తుడు ఉండేవాడు. బాబాను చూసేందుకు షిరిడీకి వచ్చేవారంతా ఈయన కట్టించిన సాఠేవాడలోనే దిగేవారు. ఆ సాఠేగారి మామగారి పేరు దాదాకేల్కర్‌! ఒకరోజు బాబాగారు ఆయనను పిలిచి ‘ఆ రోజు గురుపౌర్ణమి అనీ, గురుపూజ చేసుకోమనీ,’ సూచించారట. మరి బాబాభక్తులకు గురువు, దైవం బాబానే కదా! అందుకనే కేల్కర్, బాబా చెంతకు చేరుకుని ఆయనను ధూపదీపనైవేద్యాలతో పూజించాడు. అలా శిరిడీలో గురుపౌర్ణమి మొదలైంది. బాబాగారికి గురుపౌర్ణమి అంటే చాలా ఇష్టమనీ, ఆ రోజ...

గురుపౌర్ణమి రోజున వ్యాసుని ఎందుకు తల్చుకోవాలి!

వ్యాసమహర్షి ఆషాఢపౌర్ణమి రోజున జన్మించాడు కాబట్టి, ఆ రోజుని వ్యాసపౌర్ణమిగా పేర్కొంటారు. కానీ ఆదే రోజుని గురుపౌర్ణమిగా ఎందుకు భావిస్తాం అంటే చాలా స్పష్టమైన కారణాలే కనిపిస్తాయి. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆ పేరు వచ్చిందంటారు. అప్పటివరకూ ఉన్న వేదాలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు. వేదవ్యాసుడు అనగానే మహాభారతం కూడా గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. అంటే వ్యాసుడు లేకపోతే కౌరవపాండవులే ఉండేవారు కాదన్నమాట! పైగా వ్యాసుని తల్లి సత్యవతి, భీష్ముని తండ్రి అయిన శంతనుని వివాహం చేసుకుంటుంది. అంటే! భీష్ముని దగ్గర్నుంచీ భీముని వరకూ ప్రతి ఒక్కరూ వ్యాసునికి బంధువులే! వ్యాసుడు భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ... యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ అంటా...

గురుపౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా!

ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే! వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించడంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం రాక మానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏమిటంటే... వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వాటితో పాటు... భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులూ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా! అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదనీ... అది ఓ బిరుదనీ అంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, వారిని వ్యాసుడని పిలిచేవారట. బహుశా అందుకేనేమో... వ్యాసుని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు, సాక్షాత్తూ ఆ వ్యాసుని రూపాలే కదా! అందుకనే ప్రతి వ్యాసపౌర్ణమి రోజునా, మన కంటి ముందు కనిపించే గురువులను దైవస్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము. వ్యాసపౌర్ణమినాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాలలో కనిపిస్తుంది. పూర...

మాఘ పౌర్ణమిని మర్చిపోవద్దు

మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనంది. అందులో అనుమానం లేదు. రథసప్తమి (సూర్యుడు), భీష్మ ఏకాదశి (విష్ణుమూర్తి), శ్రీ పంచమి (సరస్వతీదేవి), మహా శివరాత్రి (శివుడు)... ఇలా సకల దేవతలనూ కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. ఇక మాఘపౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్యతీర్థాలన్నీ కళకళలాడిపోతాయి. స్నానాలలోకెల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘపౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాడము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ నాలుగు నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం నాలుగుసార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాల మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది. పైగా ఆ నాలుగు నెలలలోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయనీ, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధతత్వాన్ని కలిగి ఉంటాయనీ అంటారు. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు... ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను ...

(Telugu) మాఘపౌర్ణమి

[:te]గుడి దగ్గర కోనేరు ఉండటం సహజం. కానీ కోనేరే ఓ తీర్థ స్థలంగా ఉండటం ఆశ్చర్యం. తమిళనాడులోని కుంభకోణం నడిబొడ్డున అలాంటి ప్రశస్తమైన కోనేరు కనిపిస్తుంది. అసలు కుంభకోణం అన్న పేరే చిత్రమైనది. ప్రళయం తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని సాగించేందుకు అవసరమయ్యే జీవాన్నంతా ఒక కుంభం (కుండ)లో ఉంచి దివికి తీసుకువచ్చాడట. అలా తీసుకువచ్చిన చోటే తరువాత కాలంలో కుంభకోణంగా మారిపోయిందని చెబుతారు. ఆ ఘటనకు ప్రతీకగానే పూజలకు నోచుకోని బ్రహ్మదేవునికి సైతం కుంభకోణంలో ఓ ప్రాచీన ఆలయం కనిపిస్తుంది. కేవలం బ్రహ్మదేవునికే కాదు... శివుడు, విష్ణువులకు సంబంధించి కూడా ఎన్నో ప్రముఖ ఆలయాలు కుంభకోణంలో అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే కాశీకి వెళ్తే ఎంత పుణ్యమో కుంభకోణాన్ని దర్శించినా కూడా అంతే పుణ్యమని చెబుతుంటారు పెద్దలు. అలాంటి కుంభకోణంలో ఓ బ్రహ్మాండమైన కోనేరు ఉంది. మన దేశంలోనే అతి పెద్ద కోనేరులలో ఇది ఒకటి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో, ఈ కోనేటిలోకి సకల తీర్థాలన్నీ వచ్చి చేరతాయని అంటారు. ఆ సమయంలో ఈ కోనేటి స్నానం చేసేందుకు భక్తులు అసంఖ్యాకంగా వస్తుంటారు. 12 ఏళ్లకి ఓసారి వచ్చే ఈ పర్వాన్ని మహామహం అని పిలుచుకుంటారు. అం...

ఏరువాక పౌర్ణమి

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే... వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు... ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే ...

గురుపౌర్ణమి- శివుడే గురువైన రోజు

గురువు అన్నమాటకు చాలానే అర్థాలు వెతుక్కోవచ్చు. చీకటిలాంటి అజ్ఞానాన్ని పారద్రోలేవాడనీ, అధికుడనీ... ఇలా ఎన్ని తాత్పర్యాలనైనా విడదీయవచ్చు. ఎవరే అర్థాన్ని అన్వయించుకున్నా మానవులకు అవసరమైన జ్ఞానాన్ని అందించేవాడు గురువు అనడంలో ఎవరికీ ఏ సందేహమూ ఉండదు. అలాంటి గురువులలో ఉత్తమమైనవారు ఎవరంటే వేదవ్యాసుడూ గుర్తుకురాక మానడు. దక్షిణామూర్తి ఉదంతమూ తలపులకు రాక మానదు. వ్యాసుడు పరాశరుడు అనే రుషికీ సత్యవతి అనే జాలరి కన్యకీ పుట్టినవాడు వ్యాసుడు. అలా వ్యాసుని జననమే కులరహితంగా ఏర్పడింది. నిజానికి వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆయనకు ఆ పేరు స్థిరపడిందంటారు. అప్పటివరకూ ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు. వేదవ్యాసుడు అనగానే మహాభారతం గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. ఎందుకంటే వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. మర...

ప్ర‌పంచానికే పున్న‌మి - గురుపౌర్ణ‌మి

హైంద‌వుల గాయ‌త్రి మంత్రం `ధియోయోనః ప్ర‌చోద‌యాత్` అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని విక‌సింప‌చేయి అని అర్థం. జీవితంలోని ప్ర‌తి సంద‌ర్భంలోనూ, ప్ర‌తి ప్ర‌స్థానంలోనూ... ఏది మంచి, ఏది చెడు! ఏది ఉచితం, ఏది అనుచితం! అన్న నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంటుంది. మ‌నిషి తీసుకునే ఆయా నిర్ణ‌యాలు అత‌ని వ్య‌క్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ స‌రైన న‌డ‌వ‌డిలో ఉండాల్సిన అటువంటి సంస్కారం అల‌వ‌డాలంటే గురువు సాయం త‌ప్ప‌నిస‌రి. అది విద్య‌ని నేర్పిన గురువులు కావ‌చ్చు. విద్య ప‌ర‌మార్థాన్ని బోధించే త‌త్వ‌వేత్త‌లు కావ‌చ్చు. నేర్చుకోవాల‌న్న త‌ప‌న ఉంటే, ఈ సృష్టిలోని చరాచ‌రాల‌న్నీ మ‌న‌కి గురువుగా నిలుస్తాయి. అందుక‌నే ద‌త్తాత్రేయుడు ఆకాశం నుంచి స‌ముద్రం దాకా త‌న‌కి 24 మంది గురువులు ఉన్నార‌ని చెప్పారు. గురువును మ‌నం సాక్షాత్తూ ప‌ర‌బ్ర‌హ్మ‌గా భావించి పూజిస్తాము. ఆ దేవుని సైతం ప‌రిచ‌యం చేసేది గురువే కాబ‌ట్టి క‌బీరు, దేవుని కంటే ముందుగా త‌న గురువుకే న‌మ‌స్క‌రిస్తాన‌ని చెబుతాడు. విశిష్ట వ్య‌క్తిత్వం ఉన్న గురువుని త‌ల‌చుకునేందుకు ఒక విశిష్ట‌మైన రోజు కూడా ఉండాలి క‌దా... అదే గురుపౌర్ణ‌మి! వేద‌వ్యాసునిగా పిలువ‌బ‌డే కృష్ణద్వైపాయుని పుట...

గురు పౌర్ణమి

అందరికి నమస్కారం…. మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు. కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి వుంటే, మరి కొందరికి ఎదుటి వారిని చూసి నేర్చుకునే శక్తి వుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రించే వరకూ ప్రక్క వారి సహాయం అవసరమౌతుంది. అది మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం…. ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేదు. అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతా పితరుల ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సహచర్యంలో , వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు. ఓనమాలు అమ్మ ఒడిలో నేర్చుకుంటే, అ ఆ లు బడిలో నేర్చుకుంటాడు . ఇలా ఎవరో ఒకరి సహకారంతో జీవన పయనం సాగిస్తాడు . కాని అదే జీవితాన్ని ఎటువంటి మార్గంలో, ఎలా నడిపించాలి అన్నమీమాంస ను ఒక్క గురువు మాత్రమే తీర్చగలడు. మనలో ఎన్నో సందేహాలు. వాటిలో ముఖ్యమైనది గురువుని గురించిన సందేహం. అందుకే ఈ గురుపౌర్ణమి సందర్భంగా నాకు మరియు మరికొందరి సందేహ నివృత్తి కోసం చిన్ని ప్రయత్నం మా అత్యంత ఆప్తురాలు భారతి గారి సహకారంతో……… ముందుగా మనలో కదలాడే కొన్ని ప్రశ్నలు ………… గురువులనగా ఎవరు? .గురువులను ఎలా నిర్దేశించు కోవాలి? .గురువుల ఆవశ్యకత ఏమిటి...

ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ

Image
ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని తప్పకుండా పూజించాలి. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడి తాండవంలోఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచ...

గురు పూర్ణిమ విశిష్టత

ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ. భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే. సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నట...

గురు పూర్ణిమ సందేశం

Image
అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు. ఈశ్వరుడు ఒక్కో య...

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

Image
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్...

గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరంలాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని  ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో...