గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ
[:te] ---- భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది . ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పద...