(Telugu) నారాయణ శతకము - బమ్మెర పోతన
[:te] * అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్ సుధయై వేదవినూత్నరత్నములకున్ సూత్రాభిధానంబునై బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్ విధులై మీ బహునామరాజి వెలయున్ వేదాత్మ, నారాయణా ! * అన్నాకృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తివై యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్ గన్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై కన్పింతు, నారాయణా ! * అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్ విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్ గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా ! * అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతసామర్ధ్యులై భ్రమరీదండము మందరాచలముగాఁ బాథోనిధిం ద్రచ్చగా దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ నారాయణా ! * అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా ! ఆ (0) ఇ (2) * ఇరవొందన్ సచరాచరప...