Posts

Showing posts with the label లక్ష్మీదేవి

మారేడు చెట్టు

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆ మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.● అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆ అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున...

లక్ష్మీదేవి పూజా విధానం

👉 పూజకు కావలసిన వస్తు సామగ్రి తోరణములకు మామిడి ఆకులు దీపములుకు మట్టితోచేసిన ప్రమిదలు దీపారధనకు ఆవు నెయ్యి లేదా నువ్వులనునె నూలువత్తులు (దీపారధనకొరకు) పువ్వులు (తామర పుష్పములు) కుంకుమ పసుపు అగరువత్తులు సాంబ్రాణి గంధపు లేహ్యము 👉 పంచామృతము కొరకు కావాలసినవి : ఆవుపాలు ఆవుపెరుగు తేనె చేరుకుగడరసము లేదా పంచదార నెయ్యి. ముందుగా అమ్మవారి పటము అలంకారం చేసుకొని పెట్టుకొని ఆ పైన 2 తమలపాకుల్లో పసుపు గణపతి ని చేసుకొని సిద్ధంగా ఉండాలి.   పూజ చేసేవారు దంపతులుగా కూర్చుంటే మంచిది. వీలుకాని పక్షంలో ఒక్కరే చేసినా తప్పులేదు. మగవారు పంచ కండువ, స్త్రీలు చీర కట్టుకొని ముఖాన కుంకుమ ధరించి  పూజించాలి. శార్టులు నైటీల పైన పూజ చేయరాదు. స్త్రీలు కాళ్ళకు పసుపురాసుకొని కూర్చోవాలి. 👉 పసుపు గణపతి పూజ శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే (దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.) శ్లో // ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం కురుఘంటారవం తత్ర ద...

వీటిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది

వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోమం లేకపోవచ్చు. విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో జీవించాలంటే... పొద్దున లేచిన దగ్గర నుంచీ డబ్బుతోనే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే! అందుకోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు. మీరూ ప్రయత్నించి చూడండి... శ్రీఫలం పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్‌బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు. శ్రీసూక్తం అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇ...