Posts

Showing posts with the label తలకాడు

మైసూరు రాజులకి ఓ రాణి శాపం - తలకాడు

400 ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు. వారిలో ‘శ్రీ రంగరాయ’ ఒకరు. ఆయన ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకీ లొంగకపోవడంతో... శ్రీరంగరాయ, తలకాడుకి వెళ్లి అక్కడ వైద్యానాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించసాగారు. కానీ విధిలిఖితం! ఆయన వ్యాధి ఉపశమించకపోగా, ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలమేలమ్మ తను ఉంటున్న ‘శ్రీరంగపట్నం’ని వీడి, తలకాడుకి బయల్దేరింది. వెళ్తూ వెళ్తూ శ్రీరంగపట్నాన్ని ‘రాజా ఒడయార్‌’ అనే నమ్మకస్తునికి అప్పగించింది. రాణిగారి దుస్థిని గమనించిని ‘రాజాఒడయార్’, శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు! రాణిగారి వద్ద ఉన్న బంగారం మొత్తాన్నీ తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. రాజాఒడయార్‌ సైన్యం తన వెంటపడటం చూసిన రాణికి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావేరీ నదిలోని ‘మాలంగి’ అనే ప్రాంతంలో దూకుతూ... తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని చెబుతారు. ‘ఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది, నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండ...