Posts

Showing posts with the label హిందూ ధర్మం

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది. అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27 #గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది. సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8 అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి. అనగో హత్యావై భీమక్రియతే మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29 అమాయకులను చంపటం మహాపాపం. మన #ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి. మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15 ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది. యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16 ఎవరైతే మనిషి,...

హిందువులు ఆచరించే విధానాలను

హిందువులు ఆచరించే విధానాలను #మూఢనమ్మకాలు అనుకుంటారు చాలామంది వాళ్లందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్న అప్పుడు ఉండే పరిస్తులను బట్టి అప్పటి జనాలకు అర్ధం అయ్యేలాగా కొన్ని #ఆచారాలను పెట్టారు ప్రతి ఆచారం వెనుక ఒక #శాస్త్రీయమైన కారణం ఉంది, ఇప్పటివాళ్లకు కొందరికీ అలా చెప్తే అర్ధం కాదు కదా.... అందుకే ఇలా చెప్పండి #హిందూమతం గొప్పతనం తెలియచేయండి. Science పుట్టినదే హిందూ సంప్రదాయాల నుండి.. వంటల్లో వేసే పసుపు నుండి, వాకిట్లో వేసే ముగ్గు వరకూ అంతు తెలియని విజ్ఞానం హిందూ #ఆచారావ్యవహారాలలో దాగి ఉంది. *#గెలీలియో 15 వ శతాబ్దంలో కనుగొన్న telescope ద్వారా నవ గ్రహాల విషయం ప్రపంచానికి తెలిసింది.. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు నవ గ్రహాలు ఉన్నాయని చెప్పి, వాటిని పూజించారు,ఇప్పటికీ పూజిస్తున్నారు కూడా *#గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా #గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది. విమానం -పుష్పకవిమానం , అశరీరవాణి -రేడియో, మాయాదర్పనం- టెలీవిజన్, దృశ్యదర్శిణి-గూగుల్, టెష్ట్ ట్యూబ్ బేబి-కౌరవులు మయసభ- ...

హిందు ధర్మం

ఒక తల్లి తన నిత్య పూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి .. జరిగిన  సంభాషణలు. తల్లి  .. నాయనా,  పూజా  పునస్కారాలు  ఐనాయా .. ? కుమారుడు ..  అమ్మా !  నేను  ఒక  జీవ  శాస్త్రవేత్తని.  అది   కూడా  అమెరికాలో  మానవ  వికాసానికి  సంబంధించి  రీసెర్చ్  చేస్తున్నాను ..  డార్విన్ జీవ పరిణామ  సిద్ధాంతాన్ని  వినే వుంటారు.  అలాంటి  నేను పూజలు .. తల్లి .. కన్నా !  నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు  ..  కానీ  అతను కనిపెట్టినవి అన్ని  మన  పురాతన   ధర్మంలో ఉన్నవే  కదా  ..  ..   నీకు  అంత  ఆసక్తిగా  వుంటే  చెపుతా విను ..  ..   నీకు  దశావతరాలు .. అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి  తెలుసు కదా .. కొడుకు ఆసక్తిగా అవును తెలుసు .. దానికి  ఈ   జీవ పరిణామానికి  ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు .. ? తల్లి  ..  హా !   సంభంధం  ...

హిందూ ధర్మచక్రం - నేటి చిట్టి కథ

ఒక ఊరి లో ఒక పురాణశాస్త్రులుగారు ఉండేవాడు.  ఆయన  సాయంసమయాలలో ప్రవచనాలను చెపుతూ ఉండేవాడు. ప్రక్క ఊళ్ళనుంచి పెరుగు అమ్ముకునే కొందరు స్త్రీలు ఒకరోజున ఈయన మంచి మాటలను విన్నారు వాటి సారాంశం -  'భగవంతుడిని నమ్ముకుంటే నీళ్ళమీద నడిచేయగలం' అని! ఈ మాట వాళ్ళకి బాగా పట్టింది; ఆ రోజునుండి వాళ్ళు దేవుణ్ణి తలచుకుంటూ, ఆయనమీదే భారంవేసి నీటి పై నడుస్తూ నది దాటగలిగేీవారు . ఇలా కొన్నాళ్ళు గడిచాక, వాళ్ళలో ఒకామె అంది కదా - ' ఈ పంతులుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చు తగ్గించాడు కాబట్టి ఒక పంచెల జత ఇచ్చి గౌరవించుదాం' - అని; సరే అన్నారు మిగిలినవాళ్ళు. మరుసటిరోజున శాస్త్రులవారిని వాళ్ళ ఊరికి పిలిచారు. ఈయనా సరేనన్నాడు. తీరా నది దగ్గరకొచ్చాక, 'పడవేది?" - అని అడిగాడీయన. 'అదేంటయ్యవారూ! మీరే కదా అన్నారు - దేవుణ్ణి నమ్మితే పడవ అక్కర్లేకుండానే నదులను దాటేయవచ్చు- అని!' అన్నారు వాళ్ళు. అయినా, ఈయనకేమో నమ్మకం కలగలేదు అప్పటికీ! ' ఏదీ! నడిచి చూపించండి?' అనడిగాడు. వాళ్ళు నిస్సంకోచంగా నీటి పై నడిచి నది అటువైపుకి వెళ్ళిపోయారు, ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశాడు గానీ నీళ్ళలోకి పడిపోయాడు! **...

మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?

*మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?* 1. లియో టాల్స్టాయ్ (1828-1910) హిందువులు మరియు హిందుత్వo ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక. 2. హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946): హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచo ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది. 3. ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955): తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఉంది. 4. హుస్టన్ స్మిత్ (1919): నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది. 5. మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566): ఐరోపాలో హిందుత్వo.. పాలించే మతం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది. 6. బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970): నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను..  ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వo ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్...

సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం !

సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం.. ఎంత గొప్పగా వర్ణించారో ఒక్కసారి ఆలకించండి !* • సనాతన ధర్మశాస్త్రరీత్యా స్త్రీ ప్రకృతి స్వరూపినిగాను ధరణి(భూమాత) గాను గౌరవించటం పూజించటం జరిగింది..! • పరమాత్మ సైతం తనను రెండు భాగాలుగా విభజించుకుని అందులో రెండవ సగభాగం పరాశక్తికి ఇచ్చాడు.. • నారాయణుడు సైతం లక్ష్మిని తన వక్షస్థలమున నిలిపాడు..!! • స్త్రీలందరూ మహా ప్రకృతియొక్క అంశలతో పుడతారని వారిని గౌరవించటం మన ధర్మమని..! • స్త్రీని దేవి స్వరూపంగా భావించి గౌరిపూజ కుమారిపూజ వంటి పూజలతో వస్త్రాలు అలంకారాలతో అర్చించటం పుణ్యప్రదమని మన సనాతన సంస్కృతి తెలుపుతుంది..!! • ధర్మార్థకామ్యమోక్షార్ది అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృఋణం.. దేవ ఋణం .. ఋషి ఋణాలనుండి ముక్తుడవుతాడు.. • పురుషునకు సంతాన భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృతత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే..!! "సఖా సప్తపదాభవ" • స్నేహితలువలే ఇద్దరి మనసులు ఒక్కటికావాలి • ప్రేమానురాగాలతో జీవనం సాగించాలని కోరతారు.. • వివాహ బంధంతో స్త్రీ తన జీవితాన్ని భర్తకు అర్పించటం మాత్రమే కాదు.. • పురుషుడు సైతం తన సర్వస్వాన్ని తన జీవిత భాగస్వ...

ప్రారబ్ధ కర్మలు - హిందూ ధర్మచక్రం

జీవుడు తన శరీరమును చాలించినప్పుడు మిగిలిన ఆగామి కర్మ ఫలములను సంచితములు అని అంటారు. ఆ సంచితములలో ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని ప్రారంభ కర్మ ఫలములు అని పిలుస్తారు. జీవుడు ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి అనువైన మరొక దేహమును వెతుక్కుంటూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చిపడతాడు. ఆలా వచ్చినవాడు ప్రారబ్ధ కర్మలను అనుభవించవలసిందే. ఆలా అనుభవిస్తేనే ఆ ప్రారబ్ధ కర్మలు ఖర్చుఅవుతాయి. ఎంత గొప్పవారైనా, ఎంతటి మహానుభావులైన, ఎంతటి పుణ్యాత్ములేన, దైవభక్తులైన ప్రారబ్ధ కర్మ ఫలములను అనుభవించక తప్పదు. ప్రారబ్ధ కర్మలు ధనుస్సు నుండి విడిచిన బాణముల వంటివి. ఎక్కడైనా, ఎవరికైనా తగలవలసిందే తప్ప వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్లినా ఈ పాట్లుపడినా ప్రారబ్ధ కర్మలను వదలలేమని వేమన చెప్పనే చెప్పారు. ఎన్ని చోట్ల తిరిగి ఈ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు భూమి క్రొత్తదైనా భుక్తులు క్రొత్తవా విశ్వదాభిరామ వినురవేమ రామాయణములో భరతుడు రాముడు అరణ్యమునకు వెళ్లిన విషయమును తెలుసుకొని దుఃఖిస్తూ వశిష్ఠుని దగ్గరకు వెళ్తాడు. వశిష్ఠుడు భరతుని ఓదారుస్తూ "సంతోషం, దుఃఖం, సుఖం, చావు, పుట్టుక, కీర్తి, అపకీర్తి అన్ని ప్రారబ్ధ వశమై...

హిందూ ధర్మానికి మించినది ప్రపంచంలో ఏదైనా ఉందా?

1)సూర్యుడి నుంచి వెలువడుతున్న ఓంకారమని నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 2) మన దేశీయ గోమూత్రం మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు.? 3) న్యూజెర్సీ "సిటాన్ హాలు" యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది.? 4) ముస్లిం దేశమైన  ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు "గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్" అని, జాతీయ ఎంబ్లెమ్ కు "గరుడ పంచశిల" అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది? 5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద వినాయకుడి బొమ్మ ఉంటుందేం? 6) అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా తన జేబులో ఎప్పుడూ హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ? 7) యోగ, ప్రాణాయామాలకు ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 8) వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు భూమి గుండ్రంగా ఉందని చెప్పారేం? 🚩 9) 'లుప్త', 'హంస' అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న  హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు 'లుఫ్తాన్సా'...