(Telugu) అబ్దుల్ కలాం సూక్తులు
[:te] కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. మనం కేవలం విజయాల మీంచే పైకి రాలేము. అపజయాల మీంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రచిత్తంతో కూడిన అంకితభావం ఉండాలి. మనిషికి కష్టలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్నిఆనందించే మనస్థితినిస్తాయి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. మనమందరమూ మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనాతి గహనమైన ఆలోచనల్నీ,ఆకాక్షల్నీ,నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజిత పరుద్దాం. శక్తివంతుడైన మనిషికీ, తత్తరపాటు మనిషికీ తేడా వాళ్లు వాళ్ల అనుభావాల్ని అందుకొనే తీరులో ఉంది. విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకితభావమనేది ఉమ్మడి ధర్మం. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు. అది పూర్తిగా నిమగ్నమవడం. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగల...