(Telugu) చూడాకర్ణుని కథ
[:te]ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివశించు మటంలో "చూడాకర్ణు"డను సన్యాసి నివశించుచున్నాడు. అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివశిస్తూ ఉండేదాన్ని. అతడు లేని సమయమో, నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినపుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అపుడపుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది, నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు.
ఇలాఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతన్ని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి భోజనమారగించుచుంటిని. నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు, ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు "దీని దుంప తెగ, ఈ ఎలుక ఎంత తెలివైనది, చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూతసైతము తొలిగించి భోజనం తోలిగించుచూ నీకు నష్టం కలిగించుచున్నదా, దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, కారణం లేనిచో కార్యము పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెబుతాను విను" అని వీణాకర్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు.[:]

Comments
Post a Comment