కుమారారామం
పంచారామాలలో 'కుమారారామం'ఒకటి. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన శివలింగ భాగాన్ని కుమారస్వామి ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. అయితే ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో అంటే 11 వ శతాబ్దంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు. యోగ లింగంగా శివుడు వెలసిన ఈ క్షేత్రం సామర్లకోటలో అంతర్భాగంగా కనిపిస్తుంది. ఇక స్వామివారు 'కుమార భీమేశ్వరుడు'గా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు 'బాలా త్రిపురసుందరి'గా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో ... నాలుగు ద్వారాలతో ... కోనేటి జలాలతో ... చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం ... ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు ... కాల భైరవుడు ... వీరభద్రుడు ... మహాకాళి ... శనేశ్వరుడు ... నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు ... కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. ఇక గర్భగుడిలో రెండో...