Posts

Showing posts with the label బేతాళ కథలు

విక్రమాదిత్య కథలు - నాగదేవత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు: ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయా...

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే. కానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి. కూర్చుని తింటే కొండలైనా క...

రాక్షసుడిదానం

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, “రాజా, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి మధ్య, ఒళ్ళు జలదరింపజేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూంటే, ఒక్కొక్కసారి నీపట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది. ఎందుకంటే — కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే. ఏదైనా అలౌకికశక్తిని సాధించాలనుకునేవాడు, కొద్దిపాటి అవాంతరాలూ, ఇక్కట్లూ ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు. అలా కాక, ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు, తన ప్రయత్నంలో అవసరం అయితే ఆత్మార్పణ చేయగలడు. అయితే, కొన్ని సమయాల్లో ఏది తనమేలో, ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైన మొండి పట్టుదలగల మనుషులు కూడా వుంటారు. నిన్ను ఈ కష్టకార్యానికి పురిగొల్పిన వాడు ఎలాంటి వాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న శంక కలుగుతున్నది. అపాత్రదానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు. ఇది మానవులకే కాదు; రా...

కవిపండితులు పోటీ

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి , చెట్టు పై నుంచి శవాన్ని దించి భూజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, ఎంతో శ్రమతో కూడిన యింత కఠిన కార్యానికి, నిన్నెవరు ప్రోత్సహించారో నాకు తెలియదు. కార్యసాఫల్యం తరువాత నీకు లభించబోయేవేమిటి ? సంపదలా ? కీర్తా ? లేక యీ రెంటిని ఆశిస్తున్నావా ? ఒకే వ్యక్తి యీ రెండింటికీ అర్హుడు కావడం చాలా అరుదైన సంగతి. వివేకి అయినవాడు, ఈ రెంటిలో ఏ ఒకదాని కోసం మాత్రమే, తన యావచ్ఛక్తినీ వినియోగిస్తాడు. ఆలా కానప్పుడు ఒక్కొక్కసారి నలుగురి లో అవహేళన పాలు కావలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు, ఇద్దరు కవిపండితుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ యిలా చెప్పసాగాడు: ఒకానొకప్పుడు ప్రసన్నుడనే కవి, తన కవిత్వాన్ని వినిపించి రాజాశ్రయం సంపాదించాలని పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అప్పుడు పాటలీపుత్రాన్నేలుతున్న మహాసారుడు సాహితీ ప్రియుడని పేరు. ప్రసన్నుడు రాజదర్శనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని, రాజభటులు ఆటంకం కారణంగా అవన్నీ తన బాధను ఒక రత్నాలవ్యాపారికి చెప్పుకున్నాడు. వ్యాపారి అంతా విని, “నాకు రత్నాల విలువ మాత్...

నిజమైన వేటగాడు

Image
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచారిస్తున్నావో నాకు బోధ పడడం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయటానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నవేమో! ఎవరి ప్రాపకం కోసం ఈ పని చేస్తున్నావేమో కానీ, ఆ కార్యం నువ్వు కష్టపడి నెరవేర్చినా, వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా వట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను,’ అని కథ చెప్పసాగాడు. పూర్వం బసవయ్య అనే వేటగాడు అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెం లో నివసిస్తూండేవాడు. గూడెం పక్కనున్న అడవి లోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకుని జీవిస్తూండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్లేసరికి బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనబడ్డది. దానికి కాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారం గొలుసు కనబడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఓ కుందేలును వేటాడి ఇంటికి తీసుకునిపోయాడు. ఓ నెల తర్వ...

చంద్రరేఖ స్వయంవరం

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి , చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని , ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు . అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా , ఇంత అర్ధరాత్రి వేళ, భయం కొలిపే ఈ శ్మశానంలో మొక్కవోని నీ పట్టుదలా, కఠోరదీక్షా చూస్తుంటే నువ్వెంత సాహసవంతుడివో తెలుస్తుంది. అయితే, ఒక్కొక్కసారి మితిమించిన పట్టుదలా, సాహసాల వల్ల చివరకు సాధించినది ఏమీ లేకపోవచ్చు. అయోగ్యుడు, అసమర్ధడూ కూడా కొన్ని సందర్భాల్లో అదృష్టదేవత కరుణిస్తే అందలమెక్కిన సంఘటనలు కోకొల్లలు. ఇందుకు నిదర్శనంగా, స్త్రీ సహజమైన జాలితో ఒక అయోగ్యుణ్ణి వివాహమాడిన అపురూప సౌందర్యవతి అయిన ఒకానొక యువరాణి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం కనకపురి రాజ్యాన్ని జయకేతనుడనే రాజు పాలించేవాడు. ఆయన కుమార్తె చంద్రరేఖ అద్భుత సౌందర్యవతి. ఆమెకు చదరంగం లో మంచి ప్రావీణ్యం వుండేది. రాజు జయకేతనుడు చదరంగం లో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో, ఆమెకు బాల్యం నుంచి మంచి శిక్షణయివ్వడం వల్ల, చంద్రరేఖ చదరంగం లో రాటుతేలింది. ఇలావుండగా ఒకనాడు చంద్రరేఖ వివాహ ప్రసక్తి వచ్చింది. ఆమె, తండ్రితో, “నాన్నగారూ! నన్ను చద...

ముగ్గురుత్యాగులు

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి , చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని , ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు . అప్పుడు శవంలోని బేతాళుడు, “ రాజా, ఒక దేశానికి పరిపాలకుడివై సర్వ సంపదలతో తలతూగే నువ్వు, ఇంత రాత్రివేళ భీతికొలిపే ఈ శ్మశానంలో తిరుగాడుతుండడం, నాకు ఆశ్చర్యంతో పాటు ఎన్నో అనుమానాలకు కారణం అవుతున్నది. రాజయిన వాడు శత్రువుల నుంచే కాక, కపటులైన మిత్రులూ, భృత్యుల నుంచి కూడా తనను తాను రక్షించుకునేందుకు అప్రమత్తుడుగా ఉండాలి. తన ఆస్థానంలో పనిచేసే వారిలో ఎవరినీ కూడా ప్రభుభక్తి పరాయణుడని అవివేకంగా నమ్మి, తన రాజరికానికే ముప్పు కలిగించుకోరాదు. రాజనీతి విషయంలో ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించి, తన ఆస్థాన గూఢచారి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టబోయిన రాజు చంద్రసేనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం శరశ్చంద్రికరాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర, శివదత్తుడనే యువకుడు గూఢచారిగా వుండేవాడు. వాడు రాజు పట్ల అచంచలమైన ప్రభుభక్తి కలవాడు. అప్పచెప్పిన పనిని సాధించడంలో తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని శివదత్తుడంటే, రాజుకు ప్రత్యేకమైన అభిమానం. శరశ్చంద్రిక రా...