Posts

Showing posts with the label ఏకాదశి

ఉత్తర ద్వార దర్శనం లో ప్రత్యేకత ఏమిటి..?

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వా...

తొలి ఏకాదశి ( ఆషాఢ శుద్ధ ఏకాదశి) - విశిష్టత

తొలి ఏకాదశి హైందవులకు మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం. ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు....

ముక్కోటి ఏకాదశి

ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు . ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: 1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) 2. కార్తీక శుద్ధ ఏకాదశి 3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి) 4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశిని...

ఏకాదశి

* ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . * ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి . మాసము/పక్షము/తిథి----- పర్వదినం చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి ఆశ్వ...

తొలి ఏకాదశి

Image
  -ఆషాఢ శుద్ధ ఏకాదశి  -శయన ఏకాదశి -ప్రధమ ఏకాదశి మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వ...

అమలకీ ఏకాదశి

Image
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , ...

హరిశ్చంద్రుడు ఆచరించిన అజైకాదశి

హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలసిందే! క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి ఏకాదశి గురించీ స్వయంగా ఆ శ్రీకృష్ణుడే, ధర్మరాజుకి బోధించాడు. ఏకాదశుల మహిమ గురించి కృష్ణుడు, యుధిష్ఠిరునితో జరిపిన సంవాదం అంతా బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని బహుళపక్షంలో వచ్చే ‘అజైకాదశి’ విశేషం ఇదిగో... సత్యానికి కట్టుబడిన హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసిందే కదా! హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించేందుకు విశ్వామిత్రుడు అతడిని రాజ్యం యావత్తునీ దానం రూపంలో స్వీకరించేస్తాడు. అతని భార్య చంద్రమతినీ, కుమారుడు లోహితాస్యుడినీ హరిశ్చంద్రుని నుంచి దూరం చేస్తాడు. చివరికి ఓ చండాలుని దగ్గర అతను ఊడిగం చేసే స్థితికి తీసుకువస్తాడు. తన సర్వస్వాన్నీ కోల్పోయినా కూడా హరిశ్చంద్రుడు సత్యనిష్టకు మాత్రం కట్టుబడే ఉంటాడు. ఒకనాడు తన భార్యాపిల్లలను కోల్పోయిన బాధలో హరిశ్చంద్రుడు బాధపడుతుండగా, అతనికి గౌతమ మహర్షి కనిపించాడు. ఆ రుషి వద్ద తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు హరిశ్చంద్రుడు. దానికి గౌతమ మహర్షి ‘రాజా! మరేమీ చింతించాల్సిన పనిలేదు. నీ అదృష్టవశాత్తూ మరో ఏడు రోజులలో అజైకాదశి వ...

పుత్రద ఏకాదశికి ఏం చేయాలి!

హిందూ కాలమానంలో ఒకో ఏకాదశికీ ఒకో పేరు ఉంది.  ఆ పేరు వెనుక ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా! పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్యపురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాతైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే... రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే... రాజుగారిక...

తొలి ఏకాదశి ప్రత్యేకత

వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిసి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పెద్దలు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు. మ‌రి ఏద‌న్నా సంద‌ర్భాన్ని తీపితో ఆరంభించడం మ‌న అల‌వాటు క‌దా! అందుక‌ని ఆ కాలంలో తేలిక‌గా దొరికే పేలాల‌పిండిని బెల్లంతో క‌లుపుకుని తింటారు. పైగా పేలాలపిండి తినడం వల్ల, ఈ కాలంలో దాడిచేసే కఫసంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు. ఈ ఏకాద‌శిని తొలి అన‌డంలో మ‌రో విశేషం ఉంది. తొలి ఏకాద‌శినుంచే హిందువుల పండుగ‌ల‌న్నీ ప్రారంభం అవుతాయి. వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, వినాయ‌క‌చ‌వితి.... ఇలా ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కీ ఏదో ఒక ముఖ్యపండుగ వ‌స్తూనే ఉంటుంది. అసలు తొలిఏకాదశినే తొలిపండుగ‌గా కూడా చెప్పుకోవ్చు. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాలపాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి రాత్రివేళలు మరింత పెరుగుతాయి కాబట్టి, వాటి...

తొలి ఏకాదశి – మరి ఏం చేయాలి!

ఆషాఢం వస్తోందనగానే హిందువులంతా తొలి ఏకాదశి కోసమే ఎదురుచూస్తారు. మన పండుగలన్నీ అప్పటి నుంచీ మొదలవుతాయి కాబట్టి, ఆ రోజుని తొలి పండుగగా భావిస్తారు. అదే రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకుంటాడని ఓ నమ్మకం. నాలుగు మాసాల తర్వాత తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినాడు ఆయన నిదుర లేస్తాడట. అందుకని శయనించే రోజుని శయన ఏకాదశి అనీ, మేల్కొనే రోజుని ఉత్థాన ఏకాదశి అనీ పిలుస్తారు. ఈ నాలుగు మాసాలలోనూ కఠోర ఆహార విహార నిష్ఠలతో కూడిన చాతుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజున ఆచరించాల్సిన విధులు ఏమిటి అంటే... ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు అంతకు ముందురోజైన దశమినాటి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలట. మన జీర్ణవ్యవస్థని ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక అర్థంగా తోస్తుంది. ఇక ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండటమే కాకుండా, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. తులసీదళాలతో ఆయనను పూజించి విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి. కడుపు నిండిన మనిషి ద్యాస వేర్వేరు విధాలుగా పోతుంది. ఉప‌వాసం ఉండ‌టం ద్వారా మనసు నిశ్చలంగా...

ఉత్తరద్వార దర్శనం ఎందుకు

వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ... పౌరాణిక గాథ పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశిక ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది. ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో... ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్...

వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు

ఏకాదశి అంటేనే, మనకు ఉపవాస దీక్ష జ్ఞప్తికి వస్తుంది. ఇహ సంసారపు ఆలోచనల్లో మునిగితేలుతున్న మనం, పక్షంలో ఒక్క రోజైనా భగవంతుని వైపుగా దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఏకాదశి. దీని వలన మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఒకవేళ ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వంటి రోజులలో అయినా ఉపవాసాన్ని ఆచరించమని సూచిస్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్లు లెక్క అని కూడా పెద్దలు చెబుతారు. వైకుంఠంలోని విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకూ ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ పిలవడం కద్దు. వైకుంఠ ఏకాదశినాడు భక్తులు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుని తరిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ముందురోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభిస్తారు. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసినీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్...

భీష్మ ఏకాదశి విశిష్టత

వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు! తండ్రి  సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద...

అన్ని ఏకాదశులకూ సాటి- ఈ నిర్జల ఏకాదశి

మనిషి భోజన ప్రియుడు. ఆకలి వేసినా వేయకపోయినా ఆహారాన్ని సేవించే జీవి ఒక్క మనిషి మాత్రమే! ఆహారాన్ని దేహాన్ని పోషించేదిగా కాకుండా, నాలుకకు రుచిని ఇచ్చేదిగా భావించేదీ మనిషి ఒక్కడే. ఆహారంతో మనిషికి ఉండే ఈ సంబంధం అతనికి అనారోగ్యాన్ని ఎలాగూ కలిగిస్తుంది... ఇంద్రియ సుఖాల పట్ల అతనికి ఉన్న మోహానికి ఉదాహరణగా నిలుస్తుంది. అలా నిరంతరం ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయే మనిషిని కాస్త ఆధ్మాత్మిక దిశకు మళ్లించేందుకు పెద్దలు సూచించిన ఉపాయమే ఏకదశి ఉపవాసాలు! నిర్జల ఏకాదశి! ఒకో మాసానికి రెండు చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఏర్పడతాయి. ఈ 24 ఏకాదశులూ ఉపవాసం చేయదగ్గవే. పైగా ప్రతి ఏకాదశికీ ఒకో విశిష్టతను కల్పించారు. భీష్మ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదైకాదశి... ఇలా ప్రతి ఏకాదశికీ ఓ పేరు ఉంది. అలాగే జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు వచ్చే రోజుని ‘నిర్జల ఏకాదశి’ అన్నారు. నిర్జల అన్న పేరులోనే జలం సైతం తీసుకోకుండా సాగించే ఏకాదశి అని స్ఫురిస్తుంది. దీనినే భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఇలా భీమునితో ఈ ఏకాదశి ముడిపడటం వెనుక ఒక పురాణ గాధ లేకపోలేదు. భీముడు భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే! అలాంటి భీమునికి, తన చుట్టు పక్క...

యోగినీ ఏకాదశి కథ

దైవనామస్మరణతో మనసు మీదా, ఉపవాసంతో శరీరం మీదా అదుపుని సాధించి... భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు పెద్దలు. అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే... యోగినీ ఏకాదశి. ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ఆచరణ గురించి ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే... అలకాపురిని ఏలుతున్న కుబేరుడు సిరిసంపదలకు అధిపతి అయ్యుంటే కావచ్చు కాక! కానీ ఆయన పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే అతనికి రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు, హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. స్వరూపవతి అపర సౌందర్యవతి. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ...

ఏకాదశి – ఓ దేవత!

కార్తీకమాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులూ చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం! అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి/ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మవృత్తాంతం… అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలుదువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికీ మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. ఈలోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు.     విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతణ్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా! ఎప్పుడైతే చెడుతలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో, వెంటనే విష్ణుమూర్తిలోంచి ...

ఏకాదశి వ్రతం

ఏకాదశి వ్రతం అనగానేమి? అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది? సమాధానం: ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు. వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి. వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి. ఏకాదశీ వ్రతాలు ౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి. ౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి. ౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి. ౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి. ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి. ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది. పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల పేర్లు క్రమంగా – చైత్రం -కామదా, వైశాఖం – మోహనీ, జ్యెష్థం – నిర్జలా, ఆషాఢం – శయనీ, శ్రావణం – పుత్రదా, భాద్రపదం – పద్మా,                           ...

తొలి ఏకాదశి

Image
ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని  మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు. అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు. దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి...

ఏకాదశి వ్రతం

ఏకాదశి వ్రతం అనగానేమి? అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది? సమాధానం: ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు. వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి. వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి. ఏకాదశీ వ్రతాలు ౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి. ౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి. ౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి. ౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి. ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి. ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది. పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల పేర్లు క్రమంగా – చైత్రం -కామదా, వైశాఖం – మోహనీ, జ్యెష్థం – నిర్జలా, ఆషాఢం – శయనీ, శ్రావణం – పుత్రదా, భాద్రపదం – పద్మా, ఆశ్వియుజం – పాపాంకుశా, కార్తికం- ప్రబోధినీ, మార్గశ్శీర్షం- మోక్షదా, పుష్యం – పుత్రదా, మాఘం – జయా, ఫాల్గుణం – ఆమలకీ – అని పేర్లు అలాగే – ప్రతినెలలలో కృష్ణపక్ష ఏకదశ...