(Telugu) వైభవ వేంకటేశుడు – థామస్ మన్రో!
[:te]నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా మొదలవుతున్నాయి. మొదటి రోజున స్వామివారి వాహనమైన గురుడుని రూపం ఉన్న `గరుడ ధ్వజపటాన్ని` ధ్వజస్తంభం మీద ఎగురవేస్తారు. అదే ధ్వజారోహణం. అలా ధ్వజస్తంభం మీదకి వినయంగా చేరిన గరుడుడు ముల్లోకాలలో ఉన్న దేవతలను, బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తాడన్నమాట. మొదటి రోజున ధ్వజారోహణం అనంతరం స్వామివారిని నాలుగు మాడ వీధుల్లోనూ కన్నులపండుగగా ఊరేగిస్తారు. లోకాలను భరించే విష్ణుమూర్తి, తన భారాన్ని నిలిపేది ఆ ఆదిశేషుని మీదే కదా! అందుకే శేషవాహనానికి బ్రహ్మోత్సవాలలో అగ్రతాంబూలం! తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భరంగా ఆ దేవదేవుని వైభవాన్ని చవిచూసేందుకు, ఇక నుంచి తొమ్మిది రోజుల పాటు కొన్ని సందర్భాలను స్మరించుకుందాం. థామస్ మన్రో: ఆంగ్లేయులు కాలంలో మన దేశాన్ని ఎందరో అధికారులు పాలించారు. వారిలో చాలామంది తమ నిరంకుశత్వానికీ, అరాచకత్వానికీ పేరుపొందితే, కొద్దిమంది మాత్రం అధికారం కల్పించిన మదాన్ని కాదని తమదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నారు. అలాంటివారిలో మన్రో ఒకరు. సర్ థామస్ మన్రో 1761లో స్కాట్లండులో పుట్టాడు. 1780కి మద్రాసు చేరుకుని బ్రిటిష్ సైన్యంలో చేరాడు. సైన్యంలో భాగంగా మన్రో ఎ...