(Telugu) సుమతీ శతకము.!.......లో కొన్ని పద్యాలు
[:te] పూర్వ కాలంలో ఈ సుమతీ శతకం లోని పద్యాలు రాని వారు తెలుగునాట ఉండేవారు కారు.కాని ఇప్పుడు ఇంగ్లీషు Rhymes ను తమ పిల్లల చేత పాడించుకుంటూ తన్మయం లో మునిగిపోయి , మమ్మీడాడీ లమై పొయిన మనం ఈ నీతిశతకాలను మరచి పోవుచున్నారు. అందుకనే నావంతుగా ఇందు పొందు పరుస్తున్నాను అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా నెక్కినఁ బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ ! ఓ సుమతీ.! అవసర సమయం లో వచ్చి సహాయ పడని బంధువు , నిత్యము పూజలు చేసినా కష్టాలొచ్చినపుడు ఆదుకోని దేవుడు , యుద్ధరంగము లోకి దూకిన తరువాత పరుగెత్తని గుఱ్ఱము , ఇవి ఉండి కూడ ప్రయోజనం లేనివి కాబట్టి వీటిని వెంటనే వదలివేయాలి. బంధము వలన ఏర్పడేదే బంధుత్వము . వారి పిల్లను మనం చేసుకోవడమో , మన పిల్లవాడిని వారికివ్వడమో ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాల మూలంగా ఏర్పడే వాళ్ళే బంధువులు . మంచి చెడ్డలకు కలిసి వస్తారనే కదా వారిని మనం కలుపు కొనేది. మరి అవసర సమయం లో ఉపయోగని ఆ బంధము ఉన్నా లేకపోయినా ఒకటే కదా.! కొలువు అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ ! ఓ సుమతీ.! ...