(Telugu) కోతులు-సుచీముఖం కథ

[:te]కొంతకాలం క్రితం ఒక చెట్టు మీద "సుచీముఖం" అనే చిన్న పక్షి ఒకటి నివశిస్తూ ఉండేది. అది చాలా తెలివైనది కూడా. ఆ సమీపంలోని చెట్లమీద కొన్ని కోతులు నివశిస్తున్నాయి. చలికాలం వచ్చింది. ఒకరోజు చలి ఎక్కువగా పడసాగింది. చలికి తట్టుకోలేక కోతులు చలిమంట వేసుకోవాలనుకున్నాయి. అవి కొన్ని మిణుగురు పురుగులను చూచి నిప్పు అనుకుని వాని చుట్టూ కూర్చొని చలికాచుకోసాగాయి.

సుచీముఖం ఆ కోతుల తెలివి తక్కువతనానికి లోలోన నవ్వుకొని "మిత్రులారా! అవి మిణుగురు పురుగులు కాని, నిప్పురవ్వలు కాదు. వాటివల్ల మీ చలి తీరదు. అదిగో ఆ చెట్టు వద్ద నిప్పు ఉన్నది. అచటికి వెళ్ళి చలి కాచుకోండి" అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది. "నోరు మూసుకో, చూడబోతే చిటికెడంత లేవు, నీవు మాకు నీతులు చెప్పేదానవా? నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా? నీకింత పొగరా!" అని ఆ కోతులు దాని మెడ పట్టుకొని పిసికి చంపేశాయి. కనుక మూర్ఖులకు హితం చెప్పరాదు. చెప్పినా బుద్ధిహీనులు వారి మాటలు వినక మనకే హాని పెడతారు. అలాంటివారికి సహాయం చేయబోయి చివరకు వారే చెడిపోతారు. పూర్వం సుబుద్ధిని చెరుపబోయి దుష్టబుద్ది చెడిపోయాడు. నీకా కథ చెపుతాను విను కథ చెప్పటం ప్రారంభించింది.

 [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము