Posts

Showing posts with the label సంస్కారాలు

సంస్కారాలు-- ముహూర్తములు

అక్షరాభ్యాసం : ఉత్తరాయణం శ్రేష్ఠము. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర,రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది మంగళ శని వారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండ అష్టమ శుద్ది కలిగియుండు లగ్నమునందు అక్షరాభ్యాసం చేయవలెను. కేవలం మధ్యాహ్నం లోపుగా వున్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయ వలెను. అన్నప్రాసన : ఆరవమాసం లగాయతు మగపిల్లల విషయంలో సరిమాసములందును, అయిదవ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయవలెను. ఆరవనెల ఆరవ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్యవిషయాలు వుంటాయి. అందువలనే మంచిముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగాళ వారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి వున్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను. ఉపనయన కర్తల నిర్ణయం : "పితైవోపనయే త్పుత్రం తదభావే పితః పితా; తదభావే పితుర్భ్రాతా, తదభావేతు సోదర; తదభావే సగోత్...