(Telugu) చాటు పద్యములు
[:te]* అసలైన కాంతయైతే కుశలాదుల నడిగి నిన్ను కూర్చోమనదా కసవూడ్చు లక్ష్మికాంతికి రసికత్వంబేమి తెలుసు రంగా వినరా * అత్తుగ దూరుపు బడమర చిత్తరువు లిఖించి నిదుర జెందితి నౌరా చిత్తరువు వ్రాయ బోవలె నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్ * అన్నాతి గూడి హరుడవు అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ అన్నా తిరుమల రాయా కన్నొక్కటి కలదుకాని కౌరవ పతివే * అల్ల సాని వాని యల్లిక జిగి బిగి ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు పాండు రంగ విభుని పద గుంఫ నంబును కాక మానిరాయ ! నీకె తగుర ఆ (1) * ఆంద్ర భాష యమృత మాంద్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్ర ముత్తియములు ఆంద్ర దేశ మాయురారోగ్య వర్ధకం బాంద్ర జాతి నీతి ననుసరించు. ఇ (3) * ఇంటికి పదిలము బీగము వింటికి పదిలంబు నారి,వివరింపంగా చంటికి పదిలము రవికెయు కంటికి పదిలంబు కుందవరపు కవి చౌడప్పా ! * ఇయ్యగ ఇప్పింపం గల అయ్యలకే కాని మీస మందరికే లా? రొయ్యకు లేదా బారెడి కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా ! * ఇలలో నిద్దరు రాజులు మలయచుఁజదరంగ మాడి మాపటి వేళన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోన కేనుగు నీడ్చెన్ ఈ (1) * ఈగల్వోలె వ్రణంబులే వెదకుచున్నీర్ష్యం బరున్మెచ్చకే మూగల్వోలె నిరంతరాస్యు లగుచున్ మూర్ఖ...