Posts

Showing posts with the label తెలుగు నెలలు – ఫాల్గుణ మాసం

ఫాల్గుణ మాసం విశిష్టత

ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గుని బుద్ది వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం. వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ మాసం. శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి. శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది. పౌర్ణమి – మహా ఫల్గుని అని డోలికా పూర్ణిమ అని హోలికా పూ...