(Telugu) ఆర్ధిక ధీమా ఎలాగంటే....

[:te]ఉద్యోగంలో స్థిరపడగానే హమ్మయ్య అనుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో జీతంతో పాటూ బాధ్యతలూ, అంతకంతకూ ఖర్చులూ పెరిగిపోతాయి. వాటిని ముందే ఊహించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే ఆర్థిక ఇబ్బందులకు లోనుకాకుండా ఉంటాం.
*ఉద్యోగంలో చేరింది మొన్నే కదా... కొన్నాళ్లయ్యాక, జీతం పెరిగాక పొదుపు చేద్దాం అనుకోవద్దు. మొదటి నెల నుంచే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మొదలుపెట్టండి. నెల అవసరాలను ముందుగానే ఓ ప్రణాళిక ప్రకారం రాసుకోండి. దీనివల్ల ఎంత ఖర్చు ఉంటుంది. ఆదా చేయొచ్చు అన్నది అర్థం అవుతుంది.
*జీతం వచ్చాక అన్నీ ఖర్చులూ పోనూ మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటే ఎలా! జీతం రాగానే నేరుగా పొదుపు ఖాతాలోకి వెళ్లేలా కొంతమొత్తం దాచాలి.ఈ పద్ధతి వల్ల నెలసరి వాయిదాలు చెల్లించడానికి తీరిక లేకపోవడం, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుండటం జరగవు. ప్రతినెలా పొదుపు మొత్తం జమ అవుతుంది.
*ఖర్చు అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. అదుపు తప్పితే ఆర్ధిక ఒడుదొడుకులు తప్పవు. తరుచూ ఆధునిక ఉపకరణాలూ, దుస్తులూ కొనడం... విహార యాత్రలకు వెళ్లడం, ఖరీదైన హోటళ్లలో తినడం... వంటి వాటికి అలవాటుపడితే నెలజీతం నాల్రోజుల్లో ఖర్చుయిపోతుంది. ఈ పరిస్థితికి దూరంగా ఉండాలంటే... నలుగురితో వెళ్లినప్పుడు ఎప్పుడూ ఒకరే ఖర్చుపెట్టడం కాకుండా ముందుగానే ఎప్పుడూ ఎవరెంత ఖర్చు చేయాలి.. ఆ మొత్తం ఎంత దాటకూడదు అనే విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేయండి. అవసరాన్ని బట్టే దుస్తులూ, ఆధునిక ఉపకరణాలూ కొనాలి.[:]

Comments

Popular posts from this blog

(Telugu) మధ్వాచార్యులు

గురుశిష్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత