Posts

Showing posts with the label ప్రేమ కొసం

ప్రేమ కాలం ఎంత?

Image
వాషింగ్టన్‌: మీరు ప్రేమలో ఉన్నారా? ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో తెలుసా? మీ రక్తంలో ఆక్సిటోసిన్‌ (ప్రేమ హార్మోన్‌) శాతం తెలుసుకుంటే అది తెలుస్తుందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్‌ శాతం ఎక్కువ ఉన్న జంటలు చాలా కాలం కలిసి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్‌కి చెందిన బార్‌-1 లాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్‌ శాతం ఎక్కువ ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. తక్కువగా ఉన్న వారు విడిపోయారని 'లైవ్‌సైన్స్‌' పేర్కొంది. జంటల మధ్య వచ్చిన విభేధాలు తగ్గడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ఆక్సిటోసిన్‌ చికిత్స అవసరమని... తాజా వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే బంధంలోనూ ఈ హార్మోన్‌ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం మొదలవుతున్న తొలినాళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

(Telugu) ప్రేమికుని మనసు గ్రహించకపోతే కష్టం

[:te]ప్రేమ గుడ్డిదంటారు! అది నిజమేనని తేల్చేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. ప్రేమలో ఉన్నవారికి మిగతా ప్రపంచం సరిగా కనిపించదనీ, తమకి ఏం జరుగుతోందో పట్టదనీ ఈపాటికే తేలింది. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో పనిచేసే హార్మోన్లే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమలో ఉన్నవారు అవతలివ్యక్తి భావాలని కూడా గమనించకపోతే ఎలా! - కొంతమంది వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు... ఆ కోపాన్ని లోలోపచే అణచుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తులలోని ముభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టీ వారికి కోపం వచ్చిందని తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేమికులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపరని తేలింది. - తమ కోపాన్ని దిగమింగుకునేవారి సంగతి ఇలా ఉంటే... మరికొందరేమో ఏం జరిగినా కూడా ‘అంతా మన మంచికే’ అనే సానుకూల స్వభావంతో ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటివారి కోపాన్ని కూడా వారి ప్రేమికులు తక్కువగా అంచనా వేస్తారట. అన్నింటిలోనూ సానుకూలత చూపిస్తారు కాబట్టి, ఏం జరిగినా కూడా సానుకూలంగానే స్వీకరిస్తారులే అన్న తేలికభావంతో వీరిని తక్కువగా అంచనా వేస్తారట. - ఒక వ్యక్తి తరచూ తన భావోద్వేగాన్ని ప్రకటించేవాడై ఉంటే......

(Telugu) ప్రేమే ఆధారం

[:te]మనుషులలో అనేక అనుభూతులు ఉంటాయి కదా! అవన్నీ కలిసి ఓసారి షికారుకని బయల్దేరాయట. చక్కగా ఆడుతూ పాడుతూ ఆ అనుభూతులన్నీ ఒక ద్వీపం మీద సేదతీరుతున్నాయి. ఇంతలో ఆకాశం నల్లబడిపోయింది. ఎటు చూసినా దట్టమైన మబ్బులు. ఆ మబ్బుల మధ్య నుంచి చీల్చుకువస్తున్న మెరుపులు. మరికాసేపట్లో జోరున హోరున వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం చూసి అనుభూతులన్నీ కలత చెందాయి. అక్కడే ఉంటే ఆ వర్షంలో నిలువ నీడ లేకుండా తడిసి ముద్దైపోక తప్పదు. తమ పడవులన్నీ కొట్టుకుపోకా తప్పదు. అందుకని తలా ఒక పడవ తీసుకుని అవి సురక్షిత తీరం వైపుగా బయల్దేరాయి. ఈ హడావుడిలో పాపం ప్రేమ అనే అనుభూతికి ఏ పడవా కనిపించలేదు. దాంతో తనని తీరానికి ఎవరన్నా తీసుకువెళ్తారేమో అనుకుంటూ ఆందోళనగా అటూఇటూ చూసింది. సాయం కోసం వెతుకుతున్న ప్రేమకు, ఆడంబరం అనే అనుభూతి పడవ నడిపేందుకు సిద్ధపడుతూ కనిపించింది. ‘ఓ నేస్తమా! నన్ను కూడా కాస్త నీ నావలో ఎక్కించుకోవా!’ అంటూ ఆడంబరాన్ని ప్రాధేయపడింది ప్రేమ. ‘నిన్ను నా పడవలో ఎక్కించుకోవడమా! అసలే నా పడవ రకరకాల సంపదలతో కిక్కిరిసిపోయి ఉంది. గుట్టలు గుట్టలుగా బంగారం, కుప్పలుతెప్పలుగా బట్టలు, ప్రశంసాపత్రాలు, ...

(Telugu) ఈ పొరపాట్లతోనే ప్రేమను చేజార్చుకుంటాం

[:te]మనిషి సంఘజీవి. అతని పెరుగుదల, ఎదుగుదల అన్నీ బంధాలతోనే ముడిపడి ఉంటాయి. ఆ బంధాలను సవ్యంగా తీర్చిదిద్దుకుంటే, జీవితం ప్రేమతో నిండిపోతుంది. లేకపోతే మనసు విరిగి, జీవితం మీదే విరక్తి పుడుతుంది. కొన్ని పొరపాట్లు కనుక చేయకపోతే ఏ బంధమైనా అనుబంధంగా మారే అవకాశం ఉంది... లోపం లేని మనిషి ఉండడు ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు. ఎవరికి ఉండే లోపాలు వారికి ఉంటాయి. చాలామంది తమలోని లోపాలను వదిలిపెట్టి, తమ తోటివారి లోపాలను ఎంచుతూ ఉంటారు. వాటిని సహృదయంతో అర్థం చేసుకుని మార్గం వెతికే బదులు, దాన్ని గుచ్చి గుచ్చి గాయం చేసేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. ఫలితం! బంధం కాస్తా ఓ బరువుగా మారిపోతుంది. మార్చే ప్రయత్నం చేయవద్దు మన వేలిముద్రలే కాదు, వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా ఉంటాయి. చిన్నప్పటి పెంపకమో, జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘటనలో, మనం ఏర్పరుచుకున్న విచక్షణో... ఇలా మన ప్రవర్తనలో ప్రతి అడుగుకీ ఓ కారణం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ తనకి అనుగుణంగానే తన చుట్టుపక్కలవారంతా ఉండాలి అనుకుంటారు. అలా తన తోటి వారిని మార్చే ప్రయత్నంలో వారిని చేజార్చుకుంటారు. దాపరికం చాలామంది చిన్నచిన్న విషయాలను కూడా తమ తోటి వారి నుంచి దాచి పెడుత...

(Telugu) ప్రేమలో ఏం జరుగుతుంది

[:te]ప్రేమ దోమ కుట్టనివారు ప్రపంచంలో అరుదుగా కనిపిస్తారు. అలా ప్రేమలో పడిన మనిషి వింతగా ప్రవర్తిస్తాడని అందరికీ తెలిసిందే! ఆకలి ఉండదు, దాహం వేయదు, నిద్ర పట్టదు... అసలేదీ పట్టదు. ఇంతకీ ఇవన్నీ మనం సరదాగా అవతలివారిని ఏడిపించేందుకు చెప్పే మాటలా లేకపోతే వీటి వెనక ఏదన్నా శాస్త్రీయమైన కారణం ఉందా... అంటే జవాబుగా బోలెడు పరిశోధనలు ముందుకు వస్తున్నాయి. ప్రేమలో మన ప్రతి ఒక్క చర్యకీ స్పష్టమైన కారణాలను అందిస్తున్నాయి. వయసులోకి అడుగుపెడుతూనే టీనేజిలోకి రాగానే మనసు ప్రేమ కోసం తపించిపోయేందుకు కారణం మనలోని హార్మోనులే. ఈ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మగవారిలో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్‌ వంటి హార్మోనులు ప్రేమలో పడమని తొందరపెడుతూ ఉంటాయి. ప్రేమ ఒక మైకం ప్రేమించిన మనిషి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటుంది. దానికి కారణం డోపమైన్‌ అనే రసాయనమే! మన మెదడులో ఉత్తేజాన్ని రగిలించే ఆ డోపమైన్‌తో సిగిరెట్లు, మందు, కొకైన్‌ తీసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో... ప్రేమలో ఉన్నప్పుడు అంతే తృప్తిగా ఉంటుంది. లవ్‌ లవ్‌ లబ్ డబ్ ప్రేమించిన మనిషిని చూడగానే గుండె ఎందుకలా డబడబా కొట్టుకుంటుందో తెలుసా! మన నరాల మీద పనిచేసే...