అన్నపూర్ణ దేవత
అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద...