Posts

Showing posts with the label విగ్రహారాధన

విగ్రహారాధన

Image
వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు నిరాకార భగవంతుని సమగ్ర తత్వాన్ని మనకు అందించాయి. భగవంతుణ్ని సత్య స్వరూపుడుగా, జ్ఞాన స్వరూపుడుగా, ఆనంద స్వరూపుడుగా, సర్వ భూతాంతరాత్మగా, శాశ్వతుడుగా వర్ణించాయి. పురాణ గాథలు పేర్కొన్న అవతారాలు తరవాతి కాలంలో శిలావిగ్రహాల ప్రతిష్ఠాపనకు, దేవాలయాల నిర్మాణానికి దారి తీశాయి. ఈ సంస్కృతి బహు జనాదరణ పొందుతూ సమాజంలో బలంగా నాటుకుపోయింది. భగవంతుని ప్రతీకగా ప్రవేశించిన విగ్రహం స్వయంగా భగవానుడై, సాక్షాత్తు పరమేశ్వర రూపమై విలసిల్లింది. చంచలమైన మనస్సును నిగ్రహించి ఒకే వస్తువు మీద కేంద్రీకరించడం ఆధ్యాత్మికత లక్ష్యం. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు తమలోని ఆత్మనే భగవంతునిగా భావిస్తారు. ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టు విగ్రహారాధన. శ్రీ రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యులతో- ఆవు పాలు రక్తం రూపంలో దాని శరీరం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ పాలను దాని చెవులు పిండి లేదా కొమ్ములనుంచి పొందలేమని, పాలు దాని పొదుగు నుంచి మాత్రమే లభిస్తాయని ప్రస్తావించారు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నా, దేవాలయాల్లో ప్రత్యేకంగా విరాజిల్లుతున్నాడని వివరించారు. ఒకసారి అళ్వార్‌ మహారాజు వివేకానం...