Posts

Showing posts with the label పరశురాముడు

(Telugu) పరశురాముడు

[:te]* క్షత్రియులలో అధర్మ ప్రవర్తన పెరిగి, దుర్మదాంధులైన వారిని నశింపచేసి భూభారాన్ని తగ్గించిధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయుడు దాల్చిన అవతారం మరియు వీరు సప్త చిరంజీవులలో ఒకరు.!! * సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మరియు రేణుకా మాత కుమారునిగా జన్మించాడు. * జమదగ్ని భృగువంశానికి చెందిన ఋచీక మహర్షి మరియు గాధి రాజు కుమార్తె సత్యవతిల (అంటే విశ్వామిత్రుని సోదరి , విశ్వామిత్రుడు గాధి కుమారుడు) సంతానం. అంటే విశ్వామిత్రుడు జమదగ్నికి మేనమామ వరస మరియు పరశురామునికి తాత వరస అన్నమాట !! * ఈవిధంగా పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు కనుక ఆయనకి “భార్గవ రాముడు” అని పేరు * తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొందినవాడు కనుకనే ఆయనని “పరశురాముడు” అని పిలుస్తాము * పరశురాముని జననం చిత్రంగా ఉంటుంది.!! ఈ వివరణ భాగవతంలో ఉంటుంది. ఋచీకుడు (అనగా జమదగ్ని తండ్రి మరియు పరశురాముడి తాతగారు) తన భార్య సత్యవతి కోరిక మేరకు సంతానం కొరకై ఒక యఙ్ఞం చేసి విప్రమంత్రపూతమైన ఒక హవిస్సును సత్యవతిని తీసుకోమని రాజమంత్ర పూతమైన రెండవ హవిస్సును సత్యవతి తల్లికి ఇవ్వమని చెబుతాడు.!! కానీ పొరపాటున సత్యవతి తన తల్లికి ...