అరిషడ్వర్గాలు!
మనిషి దు:ఖానికి ,పతనానికి కూడా కారణమైన దుర్గుణాలు ఏమిటో చూద్దాం!అవి ముఖ్యంగా ఇవి— కామ —కామం (lust) క్రోధం-కోపం (anger ) మోహ-వ్యామోహం(attachment) లోభ-లోభిత్వం,పొగరుబోతుతనం(greedy) మద-గర్వం (pride) మాత్సర్య–అసూయ (jealousy ) స్వార్ధ–స్వార్ధం(selfishness) అన్యాయ-అన్యాయం చేయటం (injustice) అమానవత్వ-దయతో మెలగక పోవటం(cruelty) అహంకార–అహంకారం(ego) వీటిల్లో మరీ ప్రమాదకరమైనవి ఈ క్రింది ఆరు గుణాలు ! వీటినే అరిషడ్వర్గాలని అంటారు! 1.కామం – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండటం! 2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవటం. 3. లోభం – కోరికతో తాను పొందినది తనకే దక్కాలని, ఇతరులకు చెందగూడదనే భావం కలిగి ఉండటమే లోభం! ఇటువంటి వారు సత్కార్యాలు కూడా చేయరు, ద్రవ్యాన్ని సద్వినియోగపరచరు. 4. మోహం – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందిత...