Posts

Showing posts with the label రాఖీ పండుగ

రాఖీ పౌర్ణమి విశిష్టత మరియు చరిత్ర

హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ-పౌర్ణమి జరుపుకుంటారు.ఉత్తర భారదేశంలో రాఖీ-పౌర్ణమిని రక్షాబంధన్ గా పేర్కొంటారు.సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది.రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగ. శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" అంటారు. దీన్నే రాఖీ లేఖ రక్షాబంధన్ పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగ రోజున జంధ్యాలు ధరించే వారు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేద పఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తిని ప్రారంభించడం, ప్రారంభఋక్కును - చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు. ఈ విధంగా కాలక్రమంలో "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందిన శ్రావణ పూర్ణిమ నాడు ఈ దిగు...

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. నూతన యజ్ఞోపవీత ధారణ విధానము ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిర...

రాఖీ పండుగ

Image
  'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు. శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్...

ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ!

కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో... - భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో, ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా త‌న చీర‌కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి ర‌క్ష‌గా చుట్టింది. `న‌న్ను అన్న‌గా భావించి ఆదుకున్నావు కాబ‌ట్టి, నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో!’ అని అభ‌య‌మిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘ‌ట‌నే ర‌క్షాబంధ‌నానికి నాందిగా నిలిచిందని చెబుతారు. త‌రువాతి కాలంలో ద్రౌప‌ది చీరను లాగి కౌర‌వులు నిండుస...

చెల్లెలు పక్కన ఉంటే ఆ లైఫే వేరబ్బా

రాఖీ పండుగ వచ్చిందంటే... మన దేశంలో తెగ సందడి కనిపిస్తుంది. చిట్టి చెల్లెళ్లు, తల్లిలాంటి అక్కయ్యలు కట్టే రాఖీ కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఇంట్లో ఒక సోదరి ఉంటే ఆ విలువే వేరనుకోండి. మన జీవితంలో 10 నుంచి 14 ఏళ్లలోపు వయసు చాలా కీలకం అంటూ ఉంటారు. బాల్య దశ నుంచి టీనేజిలోకి అడుగుపెట్టే ఆ క్రమంలో మన వ్యక్తిత్వం ఎంతో మార్పుకి లోనవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న విషయమూ మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి లోనుకావడం, భయందోళనలకు గురికావడం, ఆత్మన్యూనతకి లోనుకావడం, లేనిపోని గొడవల్లో తలదూర్చడం.... లాంటి సమస్యలు ఈ వయసు కుర్రకారుని వేధిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఆశ్చర్యకరంగా ఇంట్లో అక్కయ్యకానీ, చెల్లెలు కానీ ఉన్న కుర్రకారు చాలా సంతోషంగా కనిపించారట. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటూ, ఎలాంటి ఆందోళననైనా అధిగమిస్తూ ఉన్నారట. ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే చాలు! వాళ్లు బాగా చిన్నవారైనా, పెద్దవారైనా కూడా ఇంట్లోని మగపిల్లవాడి మీద వాళ్ల సానుకూల ప్రభావం ఉన్నట్లు తేలింది. ఇంట్లో అక్కో, చెల్లో ఉంటే మనసు సంతోషంగా ఉండటమే కాద...