Posts

Showing posts with the label మంచి మాటలు

(Telugu) మంచి మాటలు

[:te] 1. జీవితంలో ఎప్పుడైనా ఎవరి నైనా పనికి రాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడ రోజుకు రెండు సార్లు సరైన సమయం సూచిస్తుంది 2. ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదలి పుండు మీద వాలే ఈగ లాంటి వాడు 3. పేదరికం ధరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడ దూరమైతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడ మిత్రులవుతారు 4. ఒక్క సారి నవ్వుతూ చూడు ప్రపంచంలో ఉండే అందాలన్ని నీ సొంతమవ్వుతాయి కానీ తడిసిన కనురెప్పలతో చూసే అద్దంకూడ మసక బారి పోతుంది 5. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువకాలం మన్నికరాదు ఎక్కువకాలం మన్నిక వచ్చేది అంతతొందరగా దొరకదు 6. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరైనది 7. మనిషికి రోగాలు కుందేలు లాగా వస్తాయి తాబేలు లాగా వెళ్లుతాయి కానీ డబ్బులు తాబేలు లాగ వస్తాయి కుందేలు లాగా వెళ్లుతాయి 8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి 9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడకు ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వక పోయ...

(Telugu) గురువు మార్గదర్శి

[:te] 1. గురువు ను దూషణ గాని పరిహాసము గాని చేయరాదు. 2. గురువును మన ఆలోచనలకు సరిపడ నడవమని చెప్పరాదు. 3. గురువు వద్దనుండి ధనము ఇచ్చి పుచ్చు కోకూడదు. 4. గురువుకు నచ్చనివారితో సహవాసమును చేయరాదు గురు దూషణ కూడ చెవులతో వినరాదు 5. గురువు చెప్పే మాట చేసే పని విరుధ్ధం గా ఉన్నా కూడా వారు చెప్పిన దాన్ని పాటించడమే 6. గురువు కూడా మనలాగ మనిషి అని తెలుసుకుని వారి తప్పులెంచకూడదు 7. గురువే భగవంతుని రూపముగా భావించాలి కాని సందేహం కూడదు. 8. గురువు వద్ద సమర్పణలో ఏరకమైన లోపము లోభము ఉండకూడదు 9. గురు ఆజ్ఞను లోకమునకు భయపడి ఆచరించకుండా ఉండరాదు 10. అందరి ముందు గురువుకు నమస్కారం చేయడానికి సిగ్గు పడకూడదు. 11. గురువును చాలా కాలము చూడకుండా ఉండకూడదు. 12. గురు పాదుక ఇచ్చారు కదా ఇక గురువెందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు 13. గురువు నుండి ప్రత్యేక ఫలితంకోసం మంత్రము అడగకూడదు . నాకు ఆమంత్రం ముందే తెలుసు అనకూడదు. 14. గురువు వద్ద నాకు మంత్రం ఓక  విధంగాను వేరొకరికి వేరే విధంగాను ఎందుకు ఇచ్చారని అడగకూడదు. మంత్రం ఇంత చిన్నగా ఉంది అని అడగకూడదు. 15. గురువుతో వేరే శిష్యులు దగ్గరగా చనువుగా ఉండటం గురువు వారికి చేసే ఉపచారాలు ఉపేక్షణలు చ...

(Telugu) ప్రేరణాత్మక తెలుగు కోట్స్

[:te] “జీవితం లో ఎన్ని మైలు రాళ్ళు ఉన్నా.. నిజంగా ఉండవలసినవి పెదవి ఫై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే” “అద్దమే నా మంచి మిత్రుడు.. ఎందుకంటె నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక -చార్లీ చాప్లిన్” “తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్…తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్… రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం” “పది మందికి మేలు చేసే వాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది వుంటారు” స్వయం కృషితో పైకి వచ్చినవారికి ఆత్మవిశ్వసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు. ని శక్తి ను నమ్ముకో.. కష్టపడు . గెలుపు కోసం శ్రమించు. గెలేచే వరకు. ఇతరుల రచనల ద్వారా మిమ్మల్ని అభివృద్ది చేసుకోవడానికి మీ కాలాన్ని వినియోగించండి.ఆ విధంగా ఇతరులు ఏంటో కస్టపడి సాధించిన దాన్ని ,మీరు తేలికగా సాధించగలరు.-సోక్రటీస్ ఈ ప్రపంచములో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్తమైన విషయం మనలో తప్పులుని ఒప్పుకోవటం జీవితానికి కొలమానం డబ్బు కాదు సంతృప్తి, సంతోషం .. మన శక్తి కన్నా చాలా సార్లు సహనం మంచి ఫలితాల్ని ఇస్తుంది….. [:]

(Telugu) అందరూ తెలుసుకోవలసిన ముత్యాల “మాటలు”

[:te] జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని…… 👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. 👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. 👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి. 👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. 👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. 👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు. 👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుం...

(Telugu) మంచి మాటలు

[:te] 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది. అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందం అన్నది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో. అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక. అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే. అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది. అణుకువ అనేది లేకుంటే అందం అనే...

(Telugu) మంచి మాటలు

[:te] చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు. చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి. చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం. చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది. చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు. చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి. చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు. చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు. చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే. చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు. చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది. చితి శవా...

(Telugu) మంచి మాటలు

[:te] నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది. నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది. నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట. నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి. నవ్వని దినం పోగొట్టుకున్న దినం. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు. నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే. నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది. నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు. నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది. నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. నిజం కానిది నిజంగా గొప్పది కాదు. నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు....

(Telugu) మంచి మాటలు

[:te] మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష. మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది. మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి. మంచి పనే మంచి ప్రార్ధన. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ. మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు. మంచి శ్రోతలే మంచి వక్తల...

(Telugu) మంచి మాటలు : భాగం - 29

[:te] నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే. ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు. శాంతగుణంతో కోపాన్నీ, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదార గుణంతో, అతి వాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు. వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు. ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు. జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు. చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి. రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి. 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతా తనే' అన్...

(Telugu) మంచి మాటలు : భాగం - 28

[:te] ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు. జాలి లేనివారే నిజమైన అంటరానివారు. విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది. గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు. అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు. ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు. నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది. అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు. మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లా...

(Telugu) మంచి మాటలు : భాగం - 27

[:te] పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం. మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు. మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది. వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం. తమ సొంతం అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు. బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు. సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు. ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది. ఒక...

(Telugu) మంచి మాటలు : భాగం - 26

[:te] ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం. మనం ఇతరులకు యిచ్చే సంతోషమే మనం నిజంగా అనుభవించే ఏకైక సంతోషం. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు. తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది. వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు. చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణశీలాలు. విరగడం కంటే వంగడం మంచిది. పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం. అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది. విద్య ఐ...

(Telugu) మంచి మాటలు : భాగం - 25

[:te] కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది. అందరిని సంతోష పరచాలని ప్రయత్నం చేసే మనిషి ప్రయత్నాలు వ్యర్ధమైనవి. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్. యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో. మొక్కగా ఉన్నప్పుడు వంచితేనే మంచిది. మాను అయిన తరువాత వీలుకాదు. మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకూ. దుర్గతికీ మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది. ఈ రోజు మీకు నచ్చకపోయినాసరే, మిమ్మల్ని ప్రేమించేవారి సలహాను రాసిపెట్టుకోండి. పని చేసే వేళలో పని, ఆటలు ఆడే సమయంలో ఆటలు ఆడండి. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు. జిజ్ఞాస చదువు అనే కొవ్వొత్తి అవుతుంది. అసూయ ఆత్మకు పచ్చకామర్లు. పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది. ...

(Telugu) మంచి మాటలు : భాగం - 24

[:te] మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది. మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు. మనం దయను అర్ధించేంత నిజాయితీతో, దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి. మరణ భయం మనల్ని మన పూర్తి జీవితాన్ని జీవించకుండా అడ్డగిస్తుంది. ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం. మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది. మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది. బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు. అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు. సామెత, బహు గొప్ప అనుభవంపై ఆధారపడిన చిన్న వాక్యం. ఏదైనా ఒక అవకాశం చేజారిప...

(Telugu) మంచి మాటలు : భాగం - 23

[:te] సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే. సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. తన మతం యొక్క హృదయాన్ని మనిషి చేరుకోగలిగితే అతడు ఇతరుల హృదయాన్ని కూడా చేరుకోగలడు. ఈ రోజన్నది నిన్నటి రోజును గురించి దిగులుపడిన రేపు అవుతుంది. చెడు మాటలు కత్తి కంతే పదునైన గయాన్ని చేస్తాయి కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే. చిన్న చిన్న త్యాగాలు కలిసే మంచి అలవాట్లను -కలిగించేలా చేస్తాయి. తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు. అహంకారం సృష్టించే చీకటిని ఛ...

(Telugu) మంచి మాటలు : భాగం - 22

[:te] శరీరానికి ఆహారం అవసరం అయినట్లే ఆత్మకు ప్రార్ధన అవసరం. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు. నవ్వని దినం పోగొట్టుకున్న దినం. మరొక కొవ్వొత్తిని వెలిగిండం వల్ల కొవ్వొత్తి కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు. తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది. నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది. అందరిని సంతోష పరచాలని ప్రయత్నం చేసే మనిషి ప్రయత్నాలు వ్యర్ధమైనవి. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం. ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి. తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే. రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అ...

(Telugu) మంచి మాటలు : భాగం - 21

[:te] రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం. మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది. నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది. అజ్ఞానం అన్నది మనస్సు యొక్క చీకటి. అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది. చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి. నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి. బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు. తాను విలువనిచ్చే స్వాతంత్ర్యం కోసం మనిషి పుట్టినప్పటి నుండి గిట్టేంతవరకు ప్రాకులాడుతూ ఉంటారు. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి. క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు. సంపదకు స్నేహితులు మొండు, కాని పేదరికాని...