ద్వాదశ రాశులు - ద్వాదశ జ్యోతిర్లింగాలు
మేషరాశి ~ రామేశ్వరం :- """""""""""""""""""""""'''''''''''''''''''''''' శ్లోకం :- ------------- సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి. వీరికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర. పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములు కూడా చేసిన మంచి ఫలితములు వచ్చును. వృషభ రాశి ~ సోమనాధ :- """"""""""""""""""""""""""""""""""""" శ్లోకం:- ------------- ...