Posts

Showing posts with the label ఆంజనేయుడు

రుద్ర నమక చమకము

Image
రుద్ర నమక చమకములలో  ప్రత్యేకించి చమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యా పరమైన సూచకములు కనబడతాయి. ఈ 11 వ అనువాకం లో ఒక రహస్యం దాగి ఉంది ఇందులో వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి దేవ సంఖ్యలు. కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి. ఉదాహరణ కు అందులో (ఏకాచమే అనగా 1, త్రిసస్చమే అనగా 3, పంచచమే = 5 సప్తచమే 7, నవచమే 9, ఏకాదశచమే 11 ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ). కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన చో ఇగో ఇలా వస్తాయి....ఏకాచమే అనగా ఒకటి =1, త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2, పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3, సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4, నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5, ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6, త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7, పంచ దశచమె = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8, సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9, నవ దశచమే = 19 + 91 = 100 కి వర్గ మూలం = 10, ఏకవిగుం శతిస్చమే = 21 +1...

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు…..!!

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం. ‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’ శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన ...

శ్రీమదాంజనేయ కల్యాణము

శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది. ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , " ఆ కన్య ఎవరు ? " అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు. బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె...

ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది ...

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. 1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయస్వామి. 4. పంచముఖాంజనేయస్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయస్వామి. 7. చతుర్భుజాంజనేయస్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు . శ్రీ ఆంజనేయం శిరసా నమామి త్రేతాయుగమున దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కొఱకు, దానవులను సంహరించి ధర్మపాలన సంస్థాపన చేయుటకై మ...

శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం

🌸శ్రీ ఆంజనేయ మహాత్మ్యం :-1🌸 🌺శ్రీ ఆంజ నేయ మంత్రోప దేశ లక్షణం🌺 ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు ”కలి కాలం లో దుఖాలను దూరం చేసేది ,దారిద్రాన్ని పోగొట్టేది ,వ్యాదులనుండి రక్షించేది ,సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియ జేయండి ”.దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా !మంచి ప్రశ్న వేశావు .నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను .అది సకల వేద శాస్త్ర ,పురాణాదుల సారమే .వెంటనే ఫలితాన్ని చచ్చేదీ .నేను ఒక సారి సరయు నది దగ్గర వుండగా ,నా తండ్రి వసిష్టుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు .శివ ,వైష్ణవ ,శాక్తేయ ,గాణా పత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు .వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీ నారాయణ విద్య ,భవానీ శంకర విద్యా ,సీతా రామ మహా విద్యా హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి .వీటి తరువాత నృసింహ విద్య ,బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతీ విద్య .ఎనిమిదవది  సామ్రాజ్య లక్ష్మీ విద్య ,తొమ్మిది  మహా గణపతి విద్య ,పది  సౌర విద్య , పదకొండ వది   దక్షిణ కాళీ విద్య .పన్నెండవ విద్య చింతామణి విద్య .వీటినే ద్వాదశ విద్యలు అంట...

మన ఇతిహాసాలు - వాలి - సుగ్రీవులు

వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగంలోను, కంఠభాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములొ వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. వాలి , సుగ్రీవులు మద్య వైర్యం సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజ...

హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి

హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో  .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను  .... నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ  .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ  .... అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి  .... హనుమని భోజనానికి పిలిచింది  .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ  .... కడుపునిండా తిను నాయనా  .... మొహమాటపడకు  అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు  .... సీతమ్మ కోసరి కోసరి వడ్డిస్తోంది  .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు  .... కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది  .... అదీ అయిపోయింది  .... తలవంచుకునే  ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు ....  హనుమ ఆవురావురమంటూ  .... సీతమ్మకి కంగారు పుట్టి .... రోజూ ఏం తింటున్నావు నాయనా  .... అని అడిగింది వినయంగా రామ నామం తల్లీ  .... వంచిన తలెత్తకుండా జవ...

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి?

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం. 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వా...

ఆంజనేయస్వామిక సేవ ఫలితం

ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చెయ్యాలి. వీణవాయిస్తున్న హనుమంతుని చిత్రమైతే  మంచిది. !! గమనిక – ఈ పరిహారాల్లో దేన్నైనా... ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. 1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం 2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి 4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి 5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి 6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి 7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి 8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు...

హనుమత్ జయంతి

హనుమత్ జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటాము. ఉత్తర భారతదేశములో మాత్రం చైత్ర పౌర్ణమినాడు హనుమత్ జయంతిగా జరుపుకోగా మనకు ఇక్కడ ఆరోజు హనుమత్ దీక్ష ప్రారంభమౌతుంది. 41రోజులు కొనసాగే ఆ దీక్ష యొక్క ముగింపు దినంనాడు మనం హనుమత్ జయంతిని జరుపుకుంటాము. హనుమత్ జయంతినాడు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. కొందరు రామాయణంలో భాగమైన సుందరకాండ పారాయణ చేస్తారు. అలాగే హనుమత్ దీక్ష చేసినవారు ప్రముఖ హనుమంతుని ఆలయాలను సందర్శించి అక్కడ తమలపాకులతో పూజ, సహస్ర నామ స్తోత్రాలను జరిపిస్తారు. అప్పాలను నైవేద్యముగా సమర్పిస్తారు. హనుమంతుడు కేసరి, అంజనాదేవిల కుమారుడు. అలాగే వాయు వరప్రసాది. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకొనేవారికి హనుమ జీవితం ఒక సందేశాత్మక గ్రంథం. ఒక గొప్ప కార్యాన్ని మాత్రమే కాదు, నిత్యజీవితంలో మనకి ఎదురయ్యే అనేకానేక సంఘర్షణలలోను, క్లిష్ట పరిస్థితులలోను హనుమ జీవితం మనకు అనుసరణీయం, ఆచరణీయం. ఆయన జీవితం నుండి మనం తెలుసుకోవలసిన విషయాలను ఒకసారి అవలోకనం చేసుకుందాం. ముఖ్యముగా విద్యార్థులకు, జీవితంలో ఎదగాలనుకొనే ప్రతివారికీ హనుమ గుణగణాలు నిత్య పారాయణ గ్రంథం. ఈనాడు ఉద్యోగాలకు, పోటీపరీక్షలకు వెళ్లేవారికి ...

ఆంజనేయుడు (హనుమంతుడు)

Image
అంజన పుట్టుక (హనుమంతుడి తల్లి) ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి...

ఆంజనేయస్వామికి వడమాల ఎందుకు?

హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు 108 వడలతో చేసిన మాలని ఆయన విగ్రహానికి అలంకరించడం తెలిసిందే! మినప్పప్పు, మిరియాలు దట్టించిన ఆ చిట్టి వడలను స్వామివారి మెడలోంచి ఎప్పుడు తీస్తారా అని పిల్లలు ఎదురుచూడటమూ తెలిసిందే! దక్షిణాది రాష్ట్రాలలో అడుగడుగునా కనిపించే ఈ వడమాల వెనక ఓ విశిష్టత ఉందంటున్నారు పెద్దలు. హనుమంతుడు చిన్నతనంలో మహా చిలిపివాడన్న విషయం విదితమే! బాలహనుమాన్‌ సూర్యుడిని మింగిన గాథ, ఆయన బాల్యచేష్టలలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ గాథ ప్రకారం - సూర్యుడిని ఎర్రటి పండుగా భావించిన ఆంజనేయుడు దాన్ని తినేందుకు బయల్దేరతాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు కూడా సూర్యుని మింగేందుకు బయల్దేరతాడు. తనకు దారిలో అడ్డువచ్చిన రాహువుని ఒక్క తాపు తన్ని మరీ హనుమంతుడు సూర్యుని మింగబోతాడు. జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకు ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ (హను)  గాయపడుతుంది. అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు జరిగినదానికి కోపగించుకుని, లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు. దాంతో దేవతలంత...

హనుమంతుని జీవితమే విజయానికి పాఠం

మన దేశంలో చిన్న పిల్లల దగ్గర్నుంచీ పండు ముసలి వరకూ హనుమంతుడు అంటే ఇష్టపడని వారు ఉండరు. వారి దృష్టిలో హనుమంతుడు ఒక దేవుడు మాత్రమే కాదు... ఒక హీరో, ఒక రోల్ మోడల్‌. ఆయన వ్యక్తిత్వంలోని ప్రతి లక్షణమూ ఆదర్శప్రాయంగానే కనిపిస్తుంది. సరదా సరదా బాల్యం కృష్ణుని బాల్య లీలలు ఎంతగా ప్రసిద్ధమో, హనుమంతుని బాల్య చేష్టలూ అంతే ప్రసిద్ధం. అవి ఒకోసారి శృతి మించవచ్చుగాక. కోరికోరి ఆపదలకి అవకాశం ఇచ్చి ఉండవచ్చుగాక. కానీ బాల్యం నిర్లిప్తంగా సాగిపోతే ఎలా! ఒక చోట బుద్ధిగా కూర్చునే పిల్లవాడిని చూసి నలుగురూ మెచ్చుకోవచ్చేమో కానీ... మున్ముందు సమస్యలను ఎదుర్కొనేందుకు కావల్సిన చొరవా, చురుకూ అతనిలో లోపిస్తాయి. శ్రేయోభిలాషి సూర్యుని దగ్గర శిష్యరికం చేసినందుకు గురుదక్షిణగా, ఆంజనేయుడు సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా ఉండేందుకు సిద్ధపడతాడు. వాలి చేతిలో పరాభవం పొందిన సుగ్రీవుడు రుష్యమూక పర్వతం మీద తలదాచుకుంటే... హనుమంతుడు కూడా అతన్ని అనుసరిస్తాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను బ్రాహ్మణుని రూపంలో పరీక్షించి.... వారిని సుగ్రీవునితో కలుపుతాడు. హనుమంతుడు తల్చుకుంటే సుగ్రీవునికే నాయకునిగా ఉండగలిగేవాడు. కానీ గురు...

సముద్రగర్భంలో హనుమంతుడు రాసిన రామాయణం!

ప్రపంచంలో మూడువందలకు పైగా రామాయణాలు ఉన్నాయని చెబుతారు. వీటి కథలలో చిన్నాచితకా తేడాలు కనిపించినా వాల్మీకి రాసిన రామాయణమే ప్రామాణికం అని భక్తుల విశ్వాసం. అలాంటిది.. వాల్మీకి కూడా అచ్చెరువొందేలా ఓ రామాయణం రూపొందింది. దానిని రాసింది ఎవరో కాదు... సాక్షాత్తూ హనుమంతుడే! హనుమంతుడు సకలశాస్త్ర పారంగతుడు. అంతటి జ్ఞానానికి తోడు సృజన కూడా ఉన్నవాడు. అందుకనే రామరావణ యుద్ధం ముగిసిన తరువాత, తనివితీరేలా తనే రామకథని రాసేందుకు నిశ్చయించుకున్నాడు. ఓ పర్వతం మీద కూర్చుని అక్కడి రాళ్ల మీద తన గోళ్లతోనే రామాయణాన్ని లిఖించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకీ, హనుమంతుని రామాయణాన్ని చదివేందుకు అక్కడకి చేరుకున్నాడు. మహారుషి వాల్మీకిని చూసిన హనుమంతుడు ఆదరించి, తను రాసిన రామాయణాన్ని చూపాడు. ఆంజనేయుడు రాళ్ల మీద చెక్కిన రామాయణాన్ని ఓపికగా చదువుతూ వందల ఏళ్లు గడిపాడు వాల్మీకి మహర్షి. అంతా పూర్తయిన తర్వాత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. ‘హనుమా! నీ రామాయణం అద్ధుతంగా ఉంది. నీ రామాయణం ముందు నేను రాసిన రామచరిత్ర దిగదుడుపే. కాబట్టి నా ప్రయత్నం అంతా వృధా అయిపోయినట్లే!’ అన్నాడు ఒకింత విచారంగా. వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఆలోచనలో...

హనుమంతునిపై పనిచేయని రామబాణం

రామనామం గొప్పదా! రామబాణం గొప్పదా అని అడిగితే చెప్పడం కష్టం. కానీ మనసు చెక్కు చెదరని భక్తితో నిండిపోతే... రాముడైనా, ఆయన సంధించే రామబాణమైనా శాంతించక తప్పదన్నది భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే రామాంజనేయుల మధ్య కొన్ని కథలను సృష్టించారు. వాటిలో ఒకటి ఇదిగో... ఒకసారి రాములవారు నిండుసభలో కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో ఆయనను దర్శించుకునేందుకు మహామహా రుషులెందరో విచ్చేశారు. వారందరూ రాములవారికి గౌరవనీయులే! అంచేత హనుమంతునికి కూడా పూజనీయులే! కానీ అక్కడే ఉన్న నారదునికి ఒక కొంటె బుద్ధి కలిగింది. కలహభోజనుడు కదా. తన అలవాటు ప్రకారం హనుమంతునికీ, రాములవారికీ మధ్య గొడవ పెట్టాలన్న కోరిక కలిగింది. అంతే! హనుమంతుని పక్కకు పిలిచి ‘నువ్వు సభలో ఉన్నవారందికీ అభివాదం చేయవచ్చునేమో! కానీ విశ్వామిత్రుని ముందు మాత్రం తల వంచవద్దు. ఎందుకంటే ఆయన ఒకప్పటి రాజు కదా. రాములవారు ఉండగా మరో రాజు ముందు నువ్వు తలవంచితే ఎలా!’ అంటూ రెచ్చగొట్టాడు. ఆ మాటలు హనుమంతునికి సబబుగానే తోచాయి. నారదుని సూచన మేరకు రుషులందరికీ అభివాదం చేసి ఒక్క విశ్వామిత్రుని మాత్రం పట్టించుకోనేలేదు. ఆపై ఆయనను కాస్త రెచ్చగొట్టాడు కూడా! హనుమంతుని చేష్టలకు కోపగించుకున్న వి...

హనుమంతుని ఆరాధించిన మత్స్య కన్య

భారతీయ చరిత్రలో రామాయణం ఒక మర్చిపోలేని అధ్యాయం. దానిని అక్షరబద్ధం చేసిన వాల్మీకి ఆదికవిగా నిలిచిపోయాడు. కానీ ఆ రామాయణం కేవలం మన దేశ సరిహద్దులలోనే ఆగిపోలేదు. రాముని గుణగణాలు, లక్ష్మణుని వినయం, రావణాసురుని అహంకారం, సీతమ్మ తల్లి ఓరిమి, హనుమంతుని స్వామిభక్తి.... ఇవన్నీ ప్రపంచంలోని ప్రతి మనిషినీ కదిలించేవే. అందుకే వాల్మీకి రామాయణం ఆధారంగా వందలాది రామాయణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిలోకి స్థానిక కవుల కల్పనలూ, అక్కడి జానపద గాధలు కూడా చొచ్చుకుపోయాయి. అలా వాల్మీకి రాసిన మూల రామాయణంలో కనిపించని పాత్రలు కూడా కొన్ని చేరిపోయాయి. వాటిలో ఒక ముఖ్యపాత్రే సువర్ణమచ్ఛ! ధాయలాండ్, కంబోడియా వంటి దేశాల రామాయణంలో ఈ సువర్ణమచ్ఛ పాత్ర చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. హనుమంతులవారు సీతమ్మ తల్లి జాడ కనుగొని, రాముడికి సమాచారాన్ని అందిస్తారు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తరువాత, లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాములవారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లని వేస్తూ ఉంటారు. కానీ అదేం చిత్రమో! రాత్రి వేసిన రాళ్లు పొద్దుటికల్లా కనిపించకుండా పోతుండేవి. దాంతో ఈ విషయా...

హనుమంతునికి మరణదండనా!

రామాయణంలో రామరావణ యుద్ధాన్ని మించిన రసవత్తరమైన ఘట్టాలు చాలానే ఉన్నాయి. పెద్ద కథలు వాటి మాటున పిట్టకథలు భక్తులను అలరిస్తూ, ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉన్నాయి. కొన్ని మూలరామాయణంలోనూ, కొన్ని జానపదాలలోనూ కనిపించే ఈ అసంఖ్యాక కథలలో ఒకటి... రామరావణ సంగ్రామం ముగిసింది. సీతాసమేత శ్రీరాములు అయోధ్యకు పట్టాభిషిక్తులయ్యారు. రాముని విజయంతో అయోధ్యాపురి నిరంతరం సందడి సందడిగా ఉంది. అలాంటి ఓ శుభసందర్భంలో వశిష్ట, విశ్వామిత్ర వంటి మహర్షులెందరో ఒక చోట చేరి సంభాషించుకోవడం మొదలుపెట్టారు. మాటల సందర్భంలో రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అన్న సందేహం దిశగా సంభాషణ సాగింది. కొందరు సాక్షాత్తూ శ్రీరాముని మించి అతని నామం ఎలా గొప్పదవుతుందని ప్రశ్నించారు. నారదుడు మాత్రం రామునికంటే రామనామమే గొప్పదన్నాడు. అనడమే కాదు! ఆ విషయాన్ని నిరూపిస్తానంటూ సవాలు విసిరాడు. నారదుని మాటలతో చర్చ వేడెక్కింది. కాసేపటికి ఎవరి మానాన వారు వెళ్లిపోయారు. నారదుడు మాత్రం తన సవాలుని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నారదుడు నిదానంగా హనుమంతుడు ఉండే చోటుకి బయల్దేరాడు. అతని చెంతకు చేరి ‘హనుమంతా! రేపు రాముని దర్బారుకి గొప్ప గొప్ప మునీశ్వ...

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు

తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. మైరావణ వృత్తాంతం రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అ...

హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందే?

ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక అందరికీ ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అదేమిటంటే... ఒక రోజు హనుమంతులవారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అలముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది. సీతమ్మ చెంతకి అడుగులో అడుగు వేసుకుంటూ ‘అమ్మా! మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు’ అని అడిగాడు. ‘హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!’ అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకి. సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకుని మురిసిపోయాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్షు పెరుగుతుందంటే... మరి ఒంటినిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు. అ...

హనుమాన్‌ అంటే!

హైందవులకు పరమ పూజనీయుడు హనుమంతుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఇంతకీ హనుమంతుడు అని పదే పదే తల్చుకునే ఆ పేరు వెనుక మర్మం ఏమిటో... వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు. ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే, నిమిషమైనా కుదురుగా ఉండలేని వానరజీవి. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు. ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. చూసిందే తడవుగా ఆ పండుని రుచి చూడాల్సిందే అని తీర్మానించుకున్నాడు. అంతే! వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ, అందులో ఉన్న ప్రమాదం గోచరి...