Posts

Showing posts with the label భీష్ముడు

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ .. గొప్ప వారు చెప్పిన గొప్ప నీతి

ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండటా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే! ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. ‘‘వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగింది- అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులిరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు. ‘‘ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర...

భీష్ముడు ఇచ్చిన అయిదు బాణాల కథ

[:te]మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఇంతచేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కనీసం ఐదు ఊళ్లన్నా ఇప్పించమన్న కృష్ణుని రాయబారమూ చెల్లలేదు. దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ, ఒకో రోజూ గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది. యుద్ధంలో తగులుతున్న ఎదురుదెబ్బలకి దుర్యోధనుడి దిమ్మ తిరిగిపోయింది. మనసులో కసి పెరిగిపోయింది. ఓ రోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు. ‘తాతా! నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి. కానీ ఐదుగురు పాండవులని చంపలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని అనుమానంగా ఉంది,’ అంటూ భీష్ముని తూలనాడాడు. దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది. పాండవులని ఓడించేందుకు తాను శాయశక్తులా పోరాడుతున్నానని ఎంతగా చెప్పినా లాభం లేకపోయింది. దాంతో తన విల్లంబులోంచి ఓ ఐదు బాణాలు బయటకి తీశాడు భీష్ముడు. వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు. ఆ తర్వాత వాటిన...

మాటల వెనుక అర్థాన్ని చూడండి

అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ ఈరోజుకీ విలువైందిగానే కనిపిస్తుంది.... పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్థంతరంగా చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు స్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు. ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదే! చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది- ‘అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప...

భీష్మ ఏకాదశి విశిష్టత

వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు! తండ్రి  సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద...

భీష్మాష్టమి – బీష్మ ఏకాదశి

రధ సప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమి గా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణ గా విడువమని చెప్పింది శాస్త్రం తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్ తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః! ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ! అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!! వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! భీష్ముడి విశిష్టత శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ” తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని…..” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తల...