కుందేలు తెలివి

ఊరి అవతల ఉండే చెరువులో ఓ కప్ప ఉండేది . చెరువు గట్టున ఉన్న చెట్టు పొదలలో ఒక కుందేలు ఉండేది . ఆ రెండు ఎంతో స్నేహంగా ఉండేవి. రొజూ కలిసి కలిసి కాసేపు కబుర్లు చెప్పు కొనిదే వాటికీ రోజు గడిచేది కాదు. ఒక రోజు అనుకోకుండా కప్ప ఒక గోతిలో పడింది. కానీ కప్ప ఫైకి రాలేక పోతుంది.దాన్ని గుర్తించిన కుందేలు కప్పకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది.కాని కప్ప దాని శక్తి సామర్జాలు తెలుసుకోలేక ఏడవటం మొదలు పెట్టింది.వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలోవేసింది అదిగో పాము ఈ గోతిలోకి వస్తుంది నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది . ఆ కంగారులో అది పామో లేక తాడో చూడకుండానే ఒక్క దూకున ఫైకి వచ్చింది . మిత్రమా నీ శక్తి నీకు తెలియక పోవటం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పింది.

నీతి : ఎప్పటికి మన శక్తి ని తక్కువ అంచనా వెసుకొరాధు.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము