(Telugu) పావురాలు-వేటకాడు కథ

[:te]అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు "వద్దు తొందర పడవద్దు మనుషులే లేని ఈ అడవిలోనికినూకలు ఎలా వచ్చినవి. ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి" అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము